Garudan Day 5 Collections 50 కోట్లకు చేరువగా గరుడన్.. 5 రోజుల్లో ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
తమిళ స్టార్ కమెడియన్ సూరి, యువ హీరోలు శశికుమార్, ఉన్ని ముకుందన్ నటించిన చిత్రం గరుడన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను నమోదు చేస్తున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న మీడియం బడ్జెట్ మూవీగా ఘనతను సొంతం చేసుకొన్నది. రేవతి శర్మ, శివాడ, సముద్రఖని, బ్రిగడ సాగ తదితరులు నటించిన ఈ సినిమా ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ కథతో ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో వెట్రిమారన్, కే కుమార్ నిర్మించారు. ఈ సినిమా 5 రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
గరుడన్ సినిమా నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 20 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ కంటెంట్, ప్రమోషనల్ ఈవెంట్స్ మూవీపై బజ్ క్రియేట్ చేశాయి.

గరుడన్ సినిమాను తొలుత 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఈ సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో స్క్రీన్ల సంఖ్యను గణనీయంగా పెంచుతున్నారు. వారాంతంలోను, వర్కింగ్ డే రోజున కూడా నిలకడగా వసూళ్లను సాధించింది. చెన్నైలో 50 శాతం, మధురైలో 60 శాతం, కోయంబత్తూరు, పాండిచ్చేరి,సలెం, దిండిగల్ 45 శాతానికిపైగా, త్రిరుచిలో 60 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసుకొన్నది.
తమిళనాడులో ఈ చిత్రం భారీగా, స్ట్రాంగ్‌గా కలెక్షన్లను నమోదు చేస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తొలి రోజున తమిళ వెర్షన్ 3.5 కోట్ల రూపాయలు, రెండో రోజున 4.9 కోట్లు, మూడో రోజున 6.5 కోట్లు, నాలుగో రోజున 2.75 కోట్ల రూపాయలు, 5వ రోజున 2.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా 5 రోజుల్లో తమిళ బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల రూపాయలు వసూలు చేసిందని పేర్కొన్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 6.5 కోట్ల రూపాయలు, రెండో రోజు 9 కోట్ల రూపాయలు, మూడో రోజు 10 కోట్ల రూపాయలు, 4వ రోజున 4 కోట్ల రూపాయలు, 5వ రోజున 3.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా సుమారుగా 44 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. త్వరలోనే ఈ సినిమా 50 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరేందుకు సిద్దమైంది.


Click it and Unblock the Notifications











