Garudan Collections గరుడన్ వసూళ్ల ఊచకోత.. సూరి, వెట్రిమారన్ మూవీకి ఎన్ని కోట్లంటే?

ప్రముఖ దర్శకుడు వెట్రిమారన్ కథతో ఆర్ఎస్ దురై సెంథిల్‌ కుమార్ దర్శకత్వంలో వెట్రిమారన్, కే కుమార్ నిర్మించిన చిత్రం గరుడన్. ఈ చిత్రంలో తమిళ కమెడియన్ సూరి, మలయాళ నటడు ఉన్ని ముకందన్, శశికుమార్, రేవతి శర్మ, శివాడ, సముద్రఖని, బ్రిగడ సాగ తదితరులు నటించారు. మే 31వ తేదీన రిలీజైన ఈ సినిమా తమిళనాడులో భారీ వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా బడ్జెట్, బ్రేక్ ఈవెన్, ఇతర బాక్సాఫీస్ వివరాల్లోకి వెళితే..

తమిళనాడులోని థేని జిల్లాలోని కోంబై ప్రాంతంలో ఓ ఆలయం చుట్టూ జరిగే కథ. ఆది (శశికుమార్), కరుణ (ఉన్ని ముకుందన్) ఇద్దరు స్నేహితులు. ఆ ప్రాంతంలో జరిగే సంఘటనల నేపథ్యంగా తమకు ఉన్న భయాలను షేర్ చేసుకొంటారు. వారితో ఆది స్నేహితుడు సోక్కన్ (సూరి) చేరుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది గరుడన్ సినిమా కథ.

Garudan Expected Box Office Collection worldwide Vetrimaaran Suri movie rocking at GBOC

గరుడన్ సినిమాను మీడియం రేంజ్ ఆర్డిస్టులు, ఆర్థర్ విల్సన్ సినిమాటోగ్రాఫర్‌గా, యువన్ శంకర్ రాజా మ్యూజిక్, ఇతర టాప్ టెక్నిషియన్స్‌తో తెరకెక్కించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 20 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీ కంటెంట్, ప్రమోషనల్ ఈవెంట్స్ మూవీపై అంచనాలు పెంచాయి.

ఈ సినిమాకు మంచి క్రేజ్ ఉండటంతో దాదాపుగా 1000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. గరుడన్ సినిమా రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ రావడంతో ఆక్యుపెన్సీ భారీగా పెరిగింది. చెన్నైలో 57 శాతం, మధురైలో 68 శాతం, కోయంబత్తూరు, పాండిచ్చేరి,సలెం, దిండిగల్ 50 శాతానికిపైగా, త్రిరుచిలో 80 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

Garudan Expected Box Office Collection worldwide Vetrimaaran Suri movie rocking at GBOC

ఇక గరుడన్ సినిమా తొలి రోజు నుంచే భారీ కలెక్షన్లు సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతున్నది. ఈ సినిమా తొలి రోజు తమిళనాడులో 3.6 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల రూపాయలు, రెండో రోజు తమిళనాడులో 4.85 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 5.5 కోట్లు వసూలు చేసింది. దాంతో కేవలం రెండు రోజుల్లోనే ఈ చిత్రం 9.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక గరుడన్ సినిమాకు ఆదివారం బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఈ చిత్రం మూడో రోజు తమిళంలో 6.2 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం 16.5 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టింది. సోమవారం నిలకడగా కలెక్షన్లు సాధిస్తే.. ఈ చిత్రం భారీ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X