Matti Kusthi Day 2 Collection తమిళంలో డబుల్ డోస్ కలెక్షన్లు.. తెలుగులోనే దారుణంగా! రెండో రోజు ఎంతంటే?
మాస్ మహారాజ్ రవితేజ నిర్మాతగా మారి విష్ణు విశాల్ హీరోగా నటించిన మట్టి కుస్తీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దారుణమైన ప్రతికూలతను ఎదుర్కొంటున్నది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, ఫన్ ఎలిమెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందనేది గత రెండు రోజుల కలెక్షన్లు చూస్తే స్పష్టమవుతున్నది. దీనికి తోడు హిట్ 2 సినిమాకు మంచి టాక్ రావడంతో మట్టి కుస్తీ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడంతో తడబాటుకు గురి అవుతున్నది. ఈ నేపథ్యంలో మట్టి కుస్తీ చిత్రం రెండో రోజు కలెక్షన్ల విషయానికి వస్తే..

300 థియేటర్లలో రిలీజ్
మట్టి కుస్తీ సినిమా టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఏపీ, తెలంగాణలో భారీగా విడుదల చేశారు. నైజాంలో 90 థియేటర్స్, సీడెడ్‌లో 40 థియేటర్లు, ఆంధ్రాలో 120 థియేటర్లకుపైగా రిలీజ్ చేశారు. దాదాపుగా 300 థియేటర్లలో ఈ సినిమాను రిలీజ్ చేశారు.

తొలి రోజు కోటికి చేరువగా
భారీ అంచనాలతో డిసెంబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన మట్టి కుస్తీ చిత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తొలి రోజున దేశవ్యాప్తంగా 95 లక్షల రూపాయల షేర్ సాధించింది. తమిళంలో 80 లక్షల షేర్, తెలుగులో 15 లక్షల షేర్ సాధించింది. తొలి రోజు మోస్తారు వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద పోరాటం చేస్తున్నది.

రెండో రోజు ఆక్యుపెన్సీ ఇలా..
మట్టి కుస్తీ రెండో రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. తమిళంలో ఓవరాల్‌గా 30 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ఇక తెలుగులో మహబూబ్ నగర్ ప్రాంతంలో కాస్త బెటర్‌గా ఆక్యుపెన్సీ కనిపించింది. మిగితా ప్రాంతాల్లో 20 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ నమోదైంది.

తమిళంలో రెండింతలు పెరుగుదల
ఇక రెండో రోజు ఆశ్చర్యకరంగా తొలి రోజు కంటే డబుల్ కలెక్షన్లు సాధించింది. అయితే తెలుగు కంటే తమిళంలోనే భారీగా వసూల్లను రాబట్టింది. తమిళంలో 1.39 కోట్ల షేర్ రాబడితే.. తెలుగులో దారుణంగా కలెక్షన్లను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కేవలం 10 లక్షల షేర్ సాధించడంతో బాక్సాఫీస్ వద్ద తేలిపోయింది.

మట్టి కుస్తీ లాభాల్లోకి రావాలంటే..
మట్టి కుస్తీ సినిమా బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే.. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 2.5 కోట్ల వసూలు చేయాలని ట్రేడ్ వర్గాలు విలువకట్టాయి. అయితే గత రెండురోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల షేర్ సాధించింది. ఈ సినిమా ఏదైనా అద్బుతం సాధిస్తే తప్ప.. లాభాల్లోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











