‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ఫస్ట్ డే కలెక్షన్స్ (ఏరియా వైజ్)
హైదరాబాద్: బాలయ్య హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు తొలి రోజు బాలయ్య కెరీర్లోనే రికార్డ్ స్థాయి కలెక్షన్స్ వసూలు చేసింది.
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం తొలి రోజు దాదాపు రూ. 10.41 కోట్లు వసూలు చేసింది. బాలయ్య కెరీర్లో ఫస్ట్ డే కలెక్షన్ల విషయంలో ఇది రికార్డ్. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 37 కోట్లకు అమ్మారు. తొలి రోజే రూ. 10 కోట్లు రావడంతో... ఫస్ట్ వీక్ పూర్తయ్యేలోగా కలెక్షన్స్ మొత్తం రాబడుతుందని అంచనా వేస్తున్నారు.

ఏరియా వైజ్ వసూళ్ల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.
నైజాం - 2.3 కోట్లు
సీడెడ్ - 2.15 కోట్లు
కృష్ణ - 80 లక్షలు
గుంటూరు - 1.64 కోట్లు
వెస్ట్ గోదావరి -1.34 కోట్లు
ఈస్ట్ గోదావరి - 78 లక్షలు
వైజాగ్ - 88 లక్షలు
నెల్లూరు - 37 లక్షలు


Click it and Unblock the Notifications











