»   » బాలయ్య కెరీర్లోనే ది బెస్ట్: ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్

బాలయ్య కెరీర్లోనే ది బెస్ట్: ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రీ రిలీజ్ బిజినెస్ డిటేల్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య కోరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'. సంక్రాంతికి విడుదలవుతున్న ఈచిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగానే ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది.

ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ రైట్స్ అన్ని ఏరియాల్లో కలిసి రూ. 46.8 కోట్లకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది. బాలయ్య కెరీర్లోనే ఇది బెస్ట్ రేటు. అంటే ప్రపంచ వ్యాప్తంగా రూ. 50 కోట్లు షేర్ వస్తే సినిమా లాభాల బాటలో నడుస్తుందన్నమాట.


అయితే సంక్రాంతి సీజన్ కావడం, తెలుగు వారికి సంబంధించిన చారిత్రక చత్రం కావడం, అంచనాలు భారీగా ఉండటంతో సినిమా ఈజీగా రూ. 50 కోట్ల షేర్ సాదిస్తుందని అంచనా వేస్తున్నారు. ఏరియాల వారీగా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ఎంతకు అమ్ముడయ్యాయనే వివరాలపై ఓ లుక్కేద్దాం.


నైజాం

నైజాం

నైజాం ఏరియాలో ‘గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాను శ్రేష్ఠ్ మూవీస్ వారు రూ. 9 కోట్లకు కొనుగులు చేసారు. ఇది హీరో నితిన్ కు సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సంస్థ.


సీడెడ్, ఉత్తరాంధ్ర

సీడెడ్, ఉత్తరాంధ్ర

సీడెడ్, ఉత్తరాంధ్ర రెండు ఏరియాలు కలిపి ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సాయి కొర్రపాటి రూ. 12.5 కోట్లకు కొనుగోలు చేసారు. బాలయ్యకు సాయి కొర్రపాటి వీరాభిమాని, ఆయన గత సినిమా లెజెండ్ చిత్రాన్ని ఈయనే నిర్మించారు.


గుంటూరు, కృష్ణ

గుంటూరు, కృష్ణ

గుంటూరు, కృష్ణ రెండు ఏరియాలను కలిపి ఎస్ క్రియేషన్స్ వారు ఈ చిత్రాన్ని రూ. 7.7 కోట్లకు కొనుగోలు చేసారు.


ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరి

ఈస్ట్ గోదావరిలో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని సురేష్ ఎం.ఎఫ్.డి వారు రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.


వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి

వెస్ట్ గోదావరి ఏరియాలో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని ఆదిత్య ఫిల్మ్స్ వారు రూ. 2.8 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.


నెల్లూరు

నెల్లూరు

నెల్లూరు ఏరియాలో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాను శ్రీ యశ్వంత్ ఫిల్మ్స్ వారు రూ. 2 కోట్లకు కొనుగోలు చేసారు.


ఏపీ-తెలంగాణ

ఏపీ-తెలంగాణ

రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ చిత్రానికి థియేట్రికల్స్ రైట్స్ రూపంలో రూ. 37.2 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.


కర్నాటక

కర్నాటక

కర్ణాటక ఏరియాలో గోకుల్ ఫిల్మ్స్ వారు ఈ చిత్రాన్ని రూ. 3.8 కోట్లకు కొనుగోలు చేసారు.


యూఎస్ఏ

యూఎస్ఏ

యూఎస్ఏలో గౌతమీపుత్ర శాతకర్ణి చిత్రాన్ని రెడ్ హార్ట్ 9 పిఎం వారు రూ. 4 కోట్లకు కొనుగోలు చేసారు.


వరల్డ్ వైడ్

వరల్డ్ వైడ్

రెస్టాఫ్ ఇండియాలో ఈ చిత్రం రూ. 1.8 కోట్లు అమ్ముడయింది. ఓవరాల్ గా ప్రపంచ వ్యాప్తంగా రూ. 46.8 కోట్ల బిజినెస్ జరిగింది.


English summary
Pre-Release Business of 'Gautamiputra Satakarni' is career best for Nandamuri Balakrishna. Theatrical Rights of this historical flick were sold out for Rs 46.8 crore.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu