‘గోవిందుడు...’ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసాడు?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన ‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం అక్టోబర్ 1న విడుదలైన సంగతి తెలిసిందే. కృష్ణ వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈచిత్రంపై ముందు నుండీ భారీ అంచనాలే ఉన్నాయి. అంచనాలకు తగిన విధంగానే ఈ చిత్రం తొలి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించింది.
అయితే ఈ చిత్రం ‘అత్తారింటికి దారేది' ఫస్ట్ డే కలెక్షన్స్ బ్రేక్ చేయడంలో విఫలమైంది. అయితే ఇతర సినిమాల రికార్డులను ఈ చిత్రం బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తోంది. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం తొలి రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 8.38 కోట్లు వసూలు చేసింది.

‘గోవిందుడు అందరి వాడేలే' చిత్రం ప్రీమియర్ షో యూఎస్ఏలో ఒకరోజు ముందు(సెప్టెంబర్ 30) నిర్వహించారు. మొత్తం మంగళవారం రాత్రి దాదాపు 60కి పైగా స్క్రీన్లలో ప్రీమియర్ షో వేసారు. ప్రీమియర్ షో ద్వారా $174,183 (రూ. 1కోటి 7 లక్షలు) వసూలు చేసింది.
ఎన్నారై యువకుడి పాత్రలో రామ్ చరణ్ నటించారు. కొన్ని కారణాల విడిపోయిన తన కుటుంబ సభ్యులను కలపడానికి హీరో ఏం చేసాడు? అనే పాయింటుతో సాగిన స్టోరీకి ఫ్యామిలీ అనుబంధాలు, ఆప్యాయతలు, ఎమోషన్స్, బావామరదళ్ల సరసాలు యాడ్ చేసి వినోదాత్మకంగా తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణ వంశీ.
ప్రకాష్ రాజ్, జయసుధ, రహహాన్, శ్రీకాంత్, కమలినీ ముఖర్జీ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సమీర్ రెడ్డి, సంగీతం: యువన్‌శంకర్‌రాజా, ఆర్ట్: అశోక్‌కుమార్, ఎడిటింగ్: నవీన్, ఫైట్స్: పీటర్ హెయిన్స్, రామ్‌లక్ష్మణ్, రచన: పరుచూరి బ్రదర్స్, కథ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : కృష్ణవంశీ, నిర్మాత : బండ్ల గణేష్.


Click it and Unblock the Notifications











