Don't Miss!
- News రేవంత్ నన్ను జైల్లో వేస్తాడట..: కాంగ్రెస్ సర్కారుపై కేసీఆర్ నిప్పులు
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
గీత గోవిందం లేటెస్ట్ కలెక్షన్స్.. మామూలు విజృంభణ కాదు, షేర్ ఎంతో తెలిస్తే!
విజయ్ దేవరకొండా నటించిన గీత గోవిందం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఇరగదీస్తోంది. గీత గోవిందం చిత్రం ఈ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. బడా హీరోల చిత్రాలకు సైతం షాక్ ఇచ్చేలా గీత గోవిందం చిత్రం దూసుకుపోతోంది. రష్మిక, విజయ్ దేవరకొండ జంటగా నటించిన ఈ చిత్రాన్ని పరశురామ్ తెరకెక్కించారు. గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఈ చిత్రాన్ని అల్లు అరవింద్, బన్నీ వాసు నిర్మించారు. ఈ చిత్ర తాజా కలెక్షన్ల వివరాలు ఇప్పుడు చూద్దాం.
కెమిస్ట్రీ అదుర్స్
ఆన్ స్క్రీన్ పై విజయ్ దేవరకొండ, రష్మిక మందన కెమిస్ట్రీ అదిరిపోయింది. సగం యువత ఈ జంట కోసమే థియేటర్స్ కు పరుగులు పెట్టారు. ఇక దర్శకుడు చేసిన మ్యాజిక్ కూడా బాగా పనిచేసింది. ఫలితంగా తొలి రోజు నుంచే ఈ చిత్రానికి కనక వర్షం ప్రారంభమైంది.
బాక్సాఫీస్ దద్దరిల్లేలా
ట్రేడ్ విశ్లేషకులని సైతం ఆశ్చర్యపడేలా, టాలీవుడ్ లో మరో స్టార్ అవతరించాడని చర్చ జరిగేలా గీత గోవిందం చిత్రం 19 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్ల షేర్ కొల్లగొట్టింది. గ్రాస్ విలువ 110 కోట్లు కావడం విశేషం. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ 100 కోట్లకు పైగా గ్రాస్ సాధించిన హీరోగా అవతరించాడు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో
ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 43 కోట్ల షేర్ సాధించింది. నైజాంలో తిరుగులేని విధంగా 17 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ఈ చిత్రం 15 కోట్ల లోపు బడ్జెట్ తో మాత్రమే తెరకెక్కింది. ఈ లెక్కన ఫుల్ రన్ లో ఈ చిత్రం నిర్మాతకు 50 కోట్లకు పైగా లాభాలు తెచ్చిపెట్టనుంది.
ఆంధ్రాలో
వైజాగ్‌లో 5 కోట్ల షేర్, ఈస్ట్‌లో 3.3 కోట్లు, వెస్ట్‌లో 2. 7 కోట్లు, కృష్ణాలో 3.34 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. సీడెడ్‌లో 6 కోట్లకు పైగా షేర్ తో దూసుకుపోతోంది.
ఓవర్సీస్లో
ఓవర్సీస్ లో కూడా గీత గోవిందం ప్రభంజనం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే 9.2 కోట్లు రాబట్టింది. ఇక కర్ణాటకలో 5 కోట్లు, తమిళనాడులో 1.5 కోట్లు సాధించడం విశేషం. బాక్స్ ఆఫీస్ వద్ద కూడా ఈ చిత్రానికి పోటీనిచ్చే గట్టి చిత్రం లేకపోవడం కలిసొచ్చే అంశం.