Don't Miss!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- News బీఆర్ఎస్కు బిగ్ షాక్.. కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి
- Sports SRHకు భయపడి CSK సంచలన నిర్ణయం: ధోనీ మైండ్ గేమ్?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Lifestyle హడలెత్తిస్తున్న Bird Flu పాలు,గుడ్లు మరియు చికెన్ తినడం సురక్షితమేనా?మనుషులకూ వ్యాపిస్తుందా..నిపుణులు ఏమంటారు?
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘గీత గోవిందం’ కలెక్షన్స్: రెండో రోజూ బీభత్సమే, ఫ్లో తట్టుకోలేక స్క్రీన్ల పెంపు!
Recommended Video
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తోంది. స్టార్ హీరోల సినిమాలకు ఏ మాత్రం తీసిపోకుండా భారీ వసూళ్లు సాధిస్తోంది. తొలి రోజు రూ. 16 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ చిత్రం.... రెండో రోజుతో రూ. 25 కోట్ల మార్కును దాటేసింది. నైజాం ఏరియాలో ఆడియన్స్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో 50 స్క్రీన్లను అదనంగా యాడ్ చేశారు.
బ్లాక్‌బస్టర్ మౌత్‌టాక్
సినిమా విడుదలైన మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ కెరీర్లోనే ఈ చిత్రం బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఆగస్టు 15తో పాటు లాంగ్ వీకెండ్ ఈ చిత్రానికి మరింత కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.
100 శాతం ఆక్యుపెన్సీ
ఆగస్టు 15న సెలవు కావడంతో ఓపెనింగ్స్ అదిరిపోయాయి. రెండో రోజైన గురువారం వర్కింగ్ డే అయినప్పటికీ దాదాపు అన్ని షోలు 100 శాతం ఆక్యుపెన్సీ సాధించాయి. ఈవినింగ్ షోలకు చాలా మంది టిక్కెట్స్ దొరక్క వెనుదిరిగిన పరిస్థితులు కనిపించాయి.
సెకండ్ డే డ్రాప్
అయితే తొలి రోజుతో పోల్చుకుంటే సెకండ్ డే 30 శాతం డ్రాప్ వచ్చింది. అందుకు కారణం గురువారం రెగ్యులర్ వర్కింగ్ డే కావడం. అయితే వీకెండ్ కలెక్షన్స్ భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. శుక్రవారం తెలంగాణ ప్రాంతంలో ప్రభుత్వ సెలవు ప్రకటించడం, శని, ఆదివారాలు హాలిడే కావడంతో కలెక్షన్స్ రూ. 50 కోట్ల మార్కు ఈజీగా అధిగమిస్తుందని అంచనా వేస్తున్నారు.
సెకండ్ డే కలెక్షన్స్
రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 6 కోట్లు, కర్నాటకలో రూ. 1.4 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.3 కోట్లు, యూఎస్ఏలో రూ. 1.4 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఓవరాల్‌గా రెండో రోజు వరల్డ్ వైడ్ రూ. 10.10 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది.
వసూళ్లు అదిరిపోయాయి
రెండు రోజుల్లో మొత్తం గ్రాస్ రూ. 26.50 కోట్లకు చేరుకుంది. ఇందులో రూ. 15.70 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలైనట్ల ట్రేడ్ వర్గాల టాక్.
రెండో రోజే లాభాల్లోకి...
‘గీత గోవిందం' థియేట్రికల్ రైట్స్ రూ. 15 కోట్లకు అమ్మారు. రెండు రోజుల్లోనే రూ. 15.70 కోట్ల షేర్ రాబట్టడంతో..... 100 శాతం ఇన్వెస్ట్మెంట్ రావడంతో పాటు సినిమా లాభాల బాట పట్టినట్లయింది.