టెర్రిఫిక్: ‘గీత గోవిందం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్‌తో బాక్సాఫీస్ షేక్!

By Bojja Kumar

Recommended Video

Allu Aravind Speech @Geetha Govindam Success Meet

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' బాక్సాఫీసు వద్ద సంచలనాలు నమోదు చేస్తూ దూసుకెళుతోంది. ఆగస్టు 15న విడుదలైన
ఈ చిత్రానికి వరుస సెలవులు కలిసొచ్చాయి. సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఫస్ట్ వీకెండ్ (5 రోజులు)ముగిసే సమయానికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 55 కోట్ల గ్రాస్ రాబట్టింది. విజయ్ దేవరకొండ లాంటి అప్ కమింగ్ హీరో సినిమాకు స్టార్ హీరో రేంజిలో వసూళ్లు రావడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది.

అందరి దారి అటు వైపే...

అందరి దారి అటు వైపే...

సినిమా రిలీజ్ రోజే సూపర్ హిట్ టాక్ కావడం, ఫ్యామిలీ ప్రేక్షకులకు నచ్చే సినిమా అని మౌత్ టాక్ స్ప్రెడ్ కావడంతో.... ఈ 5 రోజులు ‘గీత గోవిందం' సినిమా ఆడుతున్న థియేటర్ల వద్ద జాతర వాతావరణ కనిపించింది. అందరూ ఈ సినిమాకే పోటెత్తడంతో చాలా చోట్ల టిక్కెట్లు దొరకని పరిస్థితులు కనిపించాయి.

అమెరికాలోనూ వసూళ్ల వరద

అమెరికాలోనూ వసూళ్ల వరద

యూఎస్ఏ బాక్సాఫీసు వద్ద సైతం ‘గీత గోవిందం' భారీ వసూళ్లు సాధించింది. ఆగస్టు 14న ఇక్కడ ప్రీమియర్ షోలో ప్రదర్శించగా ఏకంగా $400,000 వసూలు చేసి అందరినీ ఆశ్చర్య పరిచింది. విజయ్ స్థాయితో పోలిస్తే ఇది రికార్డ్ కలెక్షనే. ఫస్ట్ వీకెండ్ ఈ మూవీ 1.5 మిలియన్ డాలర్లకు పైగా రాబట్టింది.

తొలి రోజు నుండే సంచనాలు నమోదు

తొలి రోజు నుండే సంచనాలు నమోదు

గీత గోవిందం సినిమా మొదటి రోజు నుండే సంచనాలు నమోదు చేయడం మొదలు పెట్టింది. ఫస్ట్ డే ఏకంగా రూ. 16.40 కోట్లు గ్రాస్ వసూలు చేయడం ద్వారా 2018లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన టాప్ 10 చిత్రాల్లో చోటు దక్కించుకుంది.

200శాతం లాభాలు

200శాతం లాభాలు

‘గీత గోవిందం' చిత్రం థియేట్రికల్ రైట్స్ రూ. 15 కోట్లకు అమ్మారు. ఫస్ట్ వీకెండ్ రూ. 55 కోట్ల వసూలు చేయడం ద్వారా రూ. 31 కోట్ల షేర్ వసూలు చేసింది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు 200శాతానికి పైగా లాభాలు వచ్చాయి. ఫుల్ రన్‌లో ఈ మూవీ ఎంత వసూలు చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X