twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘రంగస్థలం’, ‘భరత్ అనే నేను’... లాభాల్లో రెండింటికి ఫసక్! (ఏరియా వైజ్ డిటేల్స్)

    |

    విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన 'గీత గోవిందం' చిత్రం రూ. 100 కోట్లకుపైగా వసూళ్లు సాధించి బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. అతితక్కువ బడ్జెట్‌తో తెరరెక్కిన ఈ చిత్రం 2018లో అత్యధిక లాభాలు సాధించిన సినిమాగా వార్తల్లోకి ఎక్కింది.

    ఆగిపోలేదు... విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' వచ్చేస్తోంది!ఆగిపోలేదు... విజయ్ దేవరకొండ 'టాక్సీవాలా' వచ్చేస్తోంది!

    ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పలు సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ఫుల్ రన్‌లో రూ. 130 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. తాజాగా 70 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం హైదరాబాద్‌లో ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుండటం గమనార్హం.

     ఇప్పటి వరకు వచ్చిన షేర్ ఎంత?

    ఇప్పటి వరకు వచ్చిన షేర్ ఎంత?

    ‘గీత గోవిందం' చిత్రం రూ. 130 కోట్లు గ్రాస్ వసూలు చేయడం ద్వారా రూ. 70 కోట్లకు పైగా డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. దీంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంటపండినట్లయింది.

    ఎంత లాభం వచ్చింది?

    ఎంత లాభం వచ్చింది?

    ‘గీత గోవిందం' మూవీ రైట్స్ వరల్డ్ వైడ్ అన్ని ఏరియాలకు కలిపి రూ. 15 కోట్లకు అమ్మారు. రూ. 70 కోట్ల షేర్ రావడంతో పెట్టుబడికి ఐదు రెట్లు (రూ. 55 కోట్లు) లాభాలు వచ్చినట్లయింది.

    ఏరియా వైజ్ లాభాలు

    ఏరియా వైజ్ లాభాలు

    ఏరియా వైజ్ లాభాలు పరిశీలిస్తే నైజాం ఏరియాలో రూ. 4 కోట్లకు రైట్స్ అమ్మితే... రూ. 20 కోట్ల షేర్ వచ్చింది. దీంతో ఇక్కడ లాభం రూ. 16.5 కోట్లు వచ్చినట్లయింది. సీడెడ్ ఏరియాలో రూ. 5 కోట్లు, వైజాగ్ రూ. 4.92 కోట్లు, ఈస్ట్‌లో రూ. 3.31 కోట్లు, వెస్ట్‌లో రూ. 2.59 కోట్లు, కృష్ణలో రూ. 2.96 కోట్లు, గుంటూరులో రూ. 2.85 కోట్లు, నెల్లూరులో రూ. 1.34 కోట్లు, కర్నాటకలో రూ. 4 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 8.27 కోట్ల లాభం వచ్చినట్లు తెలుస్తోంది.

    ఈ ఏడాది లాభాల్లో టాప్

    ఈ ఏడాది లాభాల్లో టాప్

    ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ‘గీత గోవిందం' అత్యధిక లాభాలు, అత్యధిక శాతం పెట్టుబడి సొమ్ము రికవరీ చేసిన చిత్రంగా రికార్డుల కెక్కింది. అన్ని ఏరియాలకు కలిపి రూ. 55.06 కోట్లా లాభాలు గడించింది.

    రెండో స్థానంలో రంగస్థలం

    రెండో స్థానంలో రంగస్థలం

    రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రంగస్థలం' 2018లో ఎక్కువ లాభాలు సాధించిన సినిమాల్లో 2వ స్థానంలో నిలిచింది. ఈ చిత్రం రైట్స్ రూ. 80 కోట్లకు అమ్ముడవ్వగా... రూ. 216 కోట్ల గ్రాస్ వసూలైంది. రూ. 123 కోట్ల వరకు షేర్ వసూలైంది. దీంతో రూ. 43 కోట్ల లాభం వచ్చినట్లయింది.

    మూడో స్థానంలో మహానటి

    మూడో స్థానంలో మహానటి

    మహానటి సినిమా 2018లో భారీ లాభాలు సాధించి చిత్రాల్లో 3వ స్థానంలో ఉంది. ఈ చిత్రం రైట్స్ రూ. 20 కోట్లకు అమ్మగా... రూ. 83 కోట్ల గ్రాస్ వసూలైంది. టోటల్ షేర్ రూ. 45 కోట్లు రాబట్టింది. దీంతో రూ. 25 కోట్ల లాభం వచ్చినట్లయింది.

    భరత్ అనే నేను

    భరత్ అనే నేను

    ‘భరత్ అనే నేను' చిత్రం లాభాల్లో 4వ స్థానంలో ఉంది. ఈ చిత్రం రైట్స్ రూ. 100 కోట్లకు అమ్మారు. వరల్డ్ వైడ్ గ్రాస్ రూ. 225 కోట్లు రాబట్టింది. ఇందులో రూ. 115 కోట్ల షేర్ వసూలైంది. దీంతో డిస్ట్రిబ్యూటర్ లాభం రూ. 15 కోట్లు వచ్చినట్లయింది.

    అరవింద సమేత

    అరవింద సమేత

    యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరవింద సమేత' చిత్రం రైట్స్ రూ. 91 కోట్లకు అమ్మారు. ఇప్పటి వరకు రూ. 151 కోట్ల షేర్ రాబట్టింది. రూ. 91 కోట్ల షేర్ మార్కును క్రాస్ చేసి పెట్టిన పెట్టుబడి తిరిగి రాబట్టింది. ఫుల్ రన్‌లో ఎంత లాభం వస్తుందనే తెలియాల్సి ఉంది.

    English summary
    Geetha Govindam has reportedly collected Rs 130 crore gross at the worldwide box office in its lifetime and earned a share of Rs 70.60 crore for its global distributors, who spent Rs 15 crore on its theatrical rights.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X