‘గీత గోవిందం’ కలెక్షన్ల సునామీ, రూ. 50 కోట్ల క్లబ్బులో ఎంట్రీ, భారీ లాభాలు!

By Bojja Kumar

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేసింది. ఆగస్టు 15 సెలవు రోజున మిడ్ వీక్‌లో విడుదల కావడం, ఆ తర్వాత తెలంగాణ ప్రాంతంలో అదనంగా ప్రభుత్వ సెలవు కలిసి రావడం, వీటన్నింటికంటే ముఖ్యంగా సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకోవడంతో థియేటర్లకు ప్రేక్షకుల తాకిడి విపరీతంగా పెరిగింది. రెండో రోజు వసూళ్లతోనే తమ పెట్టుబడి రికవరీ చేసుకున్న డిస్ట్రిబ్యూటర్లు మూడో రోజు నుండి భారీ లాభాలు తమ ఖాతాలో వేసుకుంటున్నారు.

ఆదివారం కలెక్షన్లతో రూ. 50 కోట్లు

ఆదివారం కలెక్షన్లతో రూ. 50 కోట్లు

తొలి రెండు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 25 కోట్ల గ్రాస్ వసూలు చేయడంతో వీకెండ్ పూర్తయ్యే సమయానికి ఈజీగా రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా అంచనా వేశారు. వారు ఊహించినట్లే ఆదివారంతో ‘గీత గోవిందం' వసూళ్లు రూ. 50 కోట్ల మార్కును రీచ్ అవ్వడం ఖాయమని తేలిపోయింది.

వసూళ్లు అదుర్స్

వసూళ్లు అదుర్స్

‘గీత గోవిందం' మూవీ తొలి రోజు రూ. 16 కోట్లకుపైగా గ్రాస్ వసూలు చేయగా, రెండో రోజుతో వసూళ్లు రూ. 25 కోట్లను అధిగమించింది. మూడో రోజైన శుక్రవారం 34 కోట్ల మార్కను అందుకోగా, శనివారం నాటికి టోటల్ గ్రాస్ రూ. 45 కోట్లను రీచ్ అయింది. ఆదివారం సెలవు రోజు కావడంతో రూ. 50 కోట్ల మార్కును అందుకుంటుందనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.

 భారీ లాభాలు

భారీ లాభాలు

‘గీత గోవిందం' థియేట్రికల్ రైట్స్ రూ. 15 కోట్లకు అమ్మారు. రెండో రోజు వసూళ్లతోనే ఈ మొత్తం షేర్ రికవరీ అయింది. తొలి నాలుగు రోజుల్లో టోటల్ షేర్ రూ. 25.12 కోట్లకు రీచ్ అయింది. భారీ లాభాలు వస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్స్ సంబరాల్లో మునిగిపోయారు.

ఫుల్‌రన్‌లో ఎంత రాబడుతుందో?

ఫుల్‌రన్‌లో ఎంత రాబడుతుందో?

సినిమా ఫస్ట్ వీక్ పూర్తయ్యే సమయానికి ఈజీగా రూ. 70 నుండి 80 కోట్ల గ్రాస్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. మరి ఫుల్ రన్‌లో ఈ చిత్రం ఎంత వసూలు చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్లో ‘గీత గోవిందం' బిగ్గెస్ట్ హిట్‌గా నమోదైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X