ఆశ్చర్యపోయే నిజాలు: గీత గోవిందం బడ్జెట్, కలెక్షన్స్, లాభాల పూర్తి వివరాలు!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన 'గీత గోవిందం' చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్మురేపుతోంది. ఆగస్టు 15 సందర్భంగా బుధవారం విడుదలైన ఈ చిత్రం మళ్లీ బుధవారం నాటికి ఏకంగా రూ. 73.50 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ట్రేడ్ పండితులను ఆశ్చర్య పరిచింది. మొదటి బుధవారం ఆగస్టు 15 హాలిడే, రెండో బుధవారం బక్రీద్ హాలిడేతో సినిమాకు కలిసొచ్చింది. నిన్న ఒక్క రోజే ప్రపంచ వ్యాప్తంగా రూ. 8.50 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక సినిమా బడ్జెట్ ఎంత? వసూళ్లు ఎంత? లాభాలు ఎంత? అనే విషయం తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

సినిమా బడ్జెట్
గీత గోవిందం చిత్రాన్ని కేవలం రూ. 5 కోట్ల బడ్జెట్లో రూపొందించారట. అనవసరమైన ఆర్భాటాలకు పోకుండా కేవలం కథ, స్క్రీప్లేను నమ్ముకుని సినిమాను ముందుకు నడిపించారు. తాను చెప్పాలనుకున్న విషయం దర్శకుడు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. దీనికి విజయ్, రష్మి పెర్ఫార్మెన్స్ మరింత ప్లస్ అయింది.

ఎంతకు అమ్మారు?
‘గీత గోవిందం' థియేట్రికల్ రైట్స్ రూ. 15 కోట్లకు అమ్మారు. విజయ్ దేవరకొండపై ఉన్న క్రేజ్, గీత ఆర్ట్స్ బేనర్ నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమా మంచి రేటుకు అమ్మడంలో సక్సెస్ అయ్యారు నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీ వాస్.

ఇప్పటి వరకు ఎంత వసూలైంది?
తొలి వారం ముగిసే సమయానికి ‘గీత గోవిందం' రూ. 65 కోట్లు రాబట్టింది. అయితే బుధవారం బక్రీద్ కావడంతో రూ. 8.50 కోట్లు యాడ్ అయ్యాయి. దీంతో వరల్డ్ వైడ్ గ్రాస్ 8 రోజుల్లో రూ. 73.5 కోట్లకు చేరుకుంది.

డిస్ట్రిబ్యూటర్ షేర్ ఎంత? లాభం ఎంత?
రూ. 15 కోట్లతో డిస్ట్రిబ్యూటర్లు సినిమాను కొనుగోలు చేశారు. రూ. 73.5 కోట్ల గ్రాస్‌లో రూ. 40 కోట్ల షేర్ వసూలైంది. దీంతో రూ. 25 కోట్ల లాభం వచ్చినట్లయింది.

సినిమాకు తగ్గని డిమాండ్
రెండో వారంలోనూ సినిమాకు మంచి డిమాండ్ ఉంది. దాదాపు అన్ని ఏరియాల్లో సాయంత్రం షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఈ నేపత్యంలో త్వరలోనే ఈ మూవీ రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును అందుకుంటుందని భావిస్తున్నారు. షేర్ వ్యాల్యూ 50 కోట్లకు చేరే అవకాశం ఉంది. అదే నిజమైతే... రూ. 5 కోట్లు పెట్టుబడితో పదింతలు లాభం తెచ్చిన చిత్రంగా రికార్డుల కెక్కనుంది.


Click it and Unblock the Notifications











