12 రోజుల్లోనే 100 కోట్లు.. విజయ్ దేవరకొండ వీరవిహారం ఆగేలా లేదుగా!

స్టార్ హీరోల సినిమాలు సూపర్ హిట్ అయితే 100 కోట్ల వసూళ్ల గురించి వింటుంటాం. తక్కువ బడ్జెట్ చిత్రంగా రూపొందిన గీత గోవిందం చిత్రం విజయం సాధిస్తుందని అంతా భావించారు. కానీ ఈ రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. కేవలం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఇంతలా ఆడియన్స్ ని మాయ చేస్తోందంటే ఆశ్చర్యంగానే ఉంది. కానీ సినిమా సినిమాకు తన క్రేజ్ పెంచుకుపోతున్న విజయ్ దేవరకొండ స్టామినాకు ఇది నిదర్శనం. తాజాగా గీత గోవిందం చిత్రం రేర్ ఫీట్ సొంతం చేసుకుంది.

Recommended Video

Vijay Devarakonda's Geetha Govindam Movie World Wide Collections
 100 కోట్ల గ్రాస్

100 కోట్ల గ్రాస్

గీత గోవిందం చిత్ర వసూళ్లు సునామి కొనసాగుతూనే ఉంది. తొలి రోజు నుంచే రికార్డులు మొదలు పెట్టిన ఈ చిత్రం కేవలం 12 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లో చేరిపోవడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం 102 కోట్ల గ్రాస్ రాబట్టింది.

సంచలనమే

సంచలనమే

ఇప్పుడిపుడే ఎదుగుతున్న విజయ్ దేవరకొండ, అసలు ఏమాత్రం అంచనాలు లేని దర్శకుడు పరశురామ్, యంగ్ బ్యూటీ రష్మిక మందన కాంబినేషన్ గీత గోవిందం చిత్రంతో సంచలనమే సృష్టించింది.

నైజాంలో అదుర్స్

నైజాంలో అదుర్స్

గీత గోవిందం చిత్రం నైజాం ఏరియాలో అదిరిపోయే వసూళ్లు సాధించింది. ఒక్క నైజాం ఏరియాలోనే 15 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఆంధ్ర, సీడెడ్ లో కూడా ఇదేస్థాయిలో జారీ కొనసాగుతోంది.

ఏరియాలవారీగా

ఏరియాలవారీగా


ప్రపంచ వ్యాప్తంగా గీత గోవిందం చిత్రం 52 కోట్ల షేర్ రాబట్టింది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరో సినిమా కాకుండా 50 కోట్ల క్లబ్ లో చేరిన చిత్రం గీత గోవిందం మాత్రమే. సీడెడ్ లో ఈ చిత్రం 5 కోట్ల కు పైగా గ్రాస్ తో దూసుకుపోతోంది. వైజాగ్ లో 4.70 కోట్ల గ్రాస్ సాధించింది. గుంటూరులో 3.5 కోట్లు సాధించడం విశేషం.

ఓవర్సీస్ అదిరేలా

ఓవర్సీస్ అదిరేలా

గీత గోవిందం చిత్రం ఓవర్సీస్ లో డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ లో 2 మిలియన్ల మార్క్ అందుకోవడం విశేషం. బాక్స్ ఆఫీస్ వద్ద ప్రస్తుతం గీత గోవిందం కు పోటీ ఇచ్చే చిత్రం మరొకటి లేదు. మరి కొంతకాలం గీత గోవిందం దూకుడు కొనసాగనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X