twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారీ లాభాలతో విజయ్ దేవరకొండ మూవీ బిజినెస్ క్లోజ్, ఏరియా వైజ్ ఫైనల్ రిపోర్ట్!

    |

    విజయ్ దేవరకొండ కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది 'గీత గోవిందం' మూవీ. పరశురాం దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలైన బాక్సాఫీసు వద్ద ఎవరూ ఊహించని సంచలన విజయం సాధించింది. రూ. 110 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరిచింది. విజయ్‌ దేవరకొండను స్టార్ హీరో రేంజికి తీసుకెళ్లింది. ఇప్పటికే 59 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం బిజినెస్ ముగిసింది. గతవారమే దాదాపు అన్ని థియేటర్ల నుండి సినిమాను తీసేశారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఫైనల్‌గా ఈ మూవీ ఎంత వసూలు చేసిందనే వివరాలు బయటకు వచ్చాయి.

    వరల్డ్ వైడ్ షేర్ ఎంతంటే..?

    వరల్డ్ వైడ్ షేర్ ఎంతంటే..?

    ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ‘గీత గోవిందం' చిత్రం ఓవరాల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 68.20 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ సాధించింది. స్టార్ హీరోల సినిమాల స్థాయిలో ఇంత భారీ షేర్ రావడం అందరినీ ఆశ్చర్య పరిచింది.

    లాభం ఎంతంటే..?

    లాభం ఎంతంటే..?

    ఈ చితం థియేట్రికల్ రైట్స్ కేవలం రూ. 15 కోట్లకు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయి. పెట్టిన పెట్టుబడికి నాలుగైదు రెట్ల లాభాలు తెచ్చి టాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఒకటిగా ఈ మూవీ నిలిచింది.

     ఏరియా వైజ్ఎంతకు అమ్మారు?

    ఏరియా వైజ్ఎంతకు అమ్మారు?

    ఈ చిత్రం థియేట్రికల్ రైట్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలికి రూ. 10.50 కోట్లకు అమ్మారు. కర్నాటక రైట్స్ రూ. 1.30 కోట్లకు, రెస్టాఫ్ ఇండియా రూ. 50 లక్షలకు, ఓవర్సీస్ రైట్స్ రూ. 2.70 కోట్లకు విక్రయించారు.

    ఏరియా వైజ్ వసూలైన షేర్ ఎంత?

    ఏరియా వైజ్ వసూలైన షేర్ ఎంత?

    ఈ చిత్రానికి నైజాంలో రూ. 10.60 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ. 6.90 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 6 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 3.16 కోట్లు, గుంటూరులో రూ. 3.80 కోట్లు, కృష్ణలో రూ. 3.67 కోట్లు, నెల్లూరులో రూ. 1.72 కోట్లు, కర్నాటక రెస్టాఫ్ ఇండియాలో రూ. 8.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.25 కోట్ల షేర్ వసూలైంది.

    గీత గోవిందం

    గీత గోవిందం

    విజయ్ దేవరకొండ, రష్మిక మండన్న జంటగా పరశురాం దర్శకత్వంలో గీతాఆర్ట్స్ 2 బేనర్లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో విడుదలైన ఈ చిత్రానికి గోపీసుందర్ సంగీతం అందించారు.

    English summary
    Geetha Govindam Closing Collections Number is out. According to the traders report, the movie has collected Rs 68.20 Cr shares at Worldwide box office in full run and turned out blockbuster.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X