Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఓవర్సీస్లో విజయ్ దేవరకొండ ధమాకా.. తొలిరోజే రికార్డు వసూళ్లు!
Recommended Video
అర్జున్‌రెడ్డి భారీ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ మరో బ్లాక్‌బస్టర్ వైపు దూసుకెళ్తున్నాడు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన గీత గోవిందం చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తున్నది. ప్రధానంగా అమెరికాలో ఈ చిత్రానికి ఊహించిన కలెక్షన్లు రావడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.
యూఎస్ బాక్సాఫీస్‌లో హంగామా
యూఎస్ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ల రూపంలో గీత గోవిందం చిత్రం భారీ వసూళ్లను సాధించింది. రిలీజ్‌కు ముందు ప్రదర్శించిన ప్రీమియర్లకు అనూహ్యమైన స్పందన వ్యక్తమైంది. ప్రీమియర్ షోలకు ఈ చిత్రం 4 లక్షల డాలర్లను వసూలు చేసింది.
మిలియన్ డాలర్ల క్లబ్ వైపు
గీత గోవిందం చిత్రానికి లాంగ్ వీకెండ్ కలిసి వచ్చే అవకాశం ఉంది. రెండో రోజుకల్లా హాఫ్ మిలియన్ డాలర్ క్లబ్లో చేరే అవకాశం ఉంది. ఇదే ఊపు కొనసాగితే తొలి వారాంతంలోనే మిలియన్ డాలర్ మార్క్ వసూలు చేసుకోవడానికి ఛాన్స్ ఉంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా
తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా కలెక్షన్లను గీత గోవిందం సాధిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం. నైజాంలో ఈ చిత్రానికి భారీ కలెక్షన్లు వస్తున్నట్టు తెలిసింది. ఆంధ్రలోని కృష్ణా, గుంటూరు, వైజాగ్‌లో మంచి స్పందన వ్యక్తమవుతున్నది.
యూఎస్‌లో భారీగా విడుదల
శ్రీరస్తు, శుభమస్తు, సోలో చిత్రాలకు దర్శకత్వం వహించిన పరుశురాం గీత గోవిందం చిత్రాన్ని రూపొందించారు. అల్లు అరవింద్, బన్నీవాసు నిర్మాణ సారథ్యంలో రూపొందిన ఈ చిత్రం ఓవర్సీస్లో 300 స్క్రీన్లకు పైగా రిలీజ్ అయింది. ఆగస్టు 15 స్వాత్రంత్య దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్‌ను సంపాదించుకొన్నది.