కలెక్షన్స్ రిపోర్ట్: టాలీవుడ్‌లో మరో స్టార్ హీరో అవతరించాడా.. తొలి రోజు అదరగొట్టేసిన గీత గోవిందం!
యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుని పోతోంది. సూపర్ పాజిటివ్ టాక్ తో ఈ చిత్రం వసూళ్ల సునామి సృష్టిస్తోంది. గీత గోవిందం చిత్రానికి స్టార్ హీరో రేంజ్ లో తొలిరోజు వసూళ్ల గణాంకాలు నమోదయ్యాయి. రష్మిక మందన, విజయ్ దేవరకొండ జోడి యువతని బాగా ఆకట్టుకుంటోంది. ఏరియావారిగా ఈ చిత్ర వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దాం.
Recommended Video


16 కోట్ల గ్రాస్
తొలి రోజు గీత గోవిందం చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 16 కోట్ల గ్రాస్ సాధించింది. స్టార్ హీరో రేంజ్ లో ఈ చిత్రానికి కలెక్షన్స్ నమోదయ్యాయి. ఇందులో షేర్ విలువ 9.66 కోట్లుగా నమోదైంది. ఈ చిత్రంపై యువతలో ఉన్న అంచనాకు అనుగుణంగానే ఆకట్టుకోవడంతో ఈస్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లో
రెండు తెలుగు రాష్ట్రాల్లో గీత గోవిందం చిత్రం 5.8 కోట్ల షేర్ వసూలు చేసింది. కేవలం నైజాం ఏరియాలోని 1.75 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. ఆగష్టు చివరి వరకు గీత గోవిందం చిత్రానికి పోటీ ఇచ్చే మరో చిత్రం విడుదల కావడం లేదు. ఇది గీత గోవిందం చిత్రానికి మరింతగా కలసి వచ్చే అంశం.

ఏరియాల వారీగా
గీత గోవిందం చిత్రం వైజాగ్ లో తొలిరోజు 70 లక్షలు, ఈస్ట్ లో 48, వెస్ట్ గోదావరిలో 45 లక్షలు సాధించింది. కృష ఏరియాలో 46, గుంటూరులో 60 లక్షల షేర్ రాబట్టడం విశేషం. ఓవర్సీస్ లో గీతగోవిందం వసూళ్లు దూసుకుపోతున్నాయి. యుఎస్ లో అప్పుడే అప్పుడే ఈ చిత్రం హాఫ్ మిలియన్ డాలర్ మార్క్ దాటేసింది.

40 కోట్లు
ఇంకా వీకెండ్ ఉంది. పోటీగా మరో చిత్రం లేదు. గీత గోవిందం చిత్రానికి యువత నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో గీతగోవిందం చిత్రం తుది వసూళ్లు 40 కోట్లు దాటినా ఆశ్చర్యపోనవసరం లేదనే అంచనాలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











