‘గీత గోవిందం’ ప్రీ రిలీజ్ బిజినెస్ ... విజయ్ దేవరకొండ సరికొత్త రికార్డ్!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా పరశురాం దర్శకత్వంలో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మించిన 'గీత గోవిందం' చిత్రానికి ప్రీ రిలీజ్ బిజినెస్ అదిరిపోయే రేంజిలో సాగింది. ఈ చిత్రానికి కేవలం థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రూ. 15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది.
టీజర్, ట్రైలర్ విడుదలైనప్పటి నుండే ఈ చిత్రానికి భారీ హైప్ వచ్చింది. విజయ్ దేవరకొండ నటించిన గత చిత్రాలు, 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి' మంచి విజయం సాధించడం కూడా 'గీత గోవిందం' చిత్రానికి ప్లస్ అయింది.

తెలుగు రాష్ట్రాల్లో ఎంత?
విజయ్ దేవరకొండ లాంటి క్రేజ్ స్టార్, గీతాఆర్ట్స్2 బేనర్ నుండి వస్తున్న చిత్రం కావడంతో ముందు నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో ఏపీ, తెలంగాణల్లో ఈ చిత్రం థియేట్రికల్ రైట్ష్ రూ. 10.50 కోట్లకు అమ్ముడయ్యాయి.

ఇతర ప్రాంతాల్లో...
కర్నాటకలో ఈ చిత్రాం రైట్స్ రూ. 1.50 కోట్లకు అమ్ముడవ్వగా... రెస్టాఫ్ ఇండియా రైట్స్ రూ. 50 లక్షలకు సేల్ చేశారు. ఇక ఓవర్సీస్ రైట్స్ రూ. 2.70 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. అన్ని ఏరియాల్లో కలిపి దాదాపు రూ. 15 కోట్ల బిజినెస్ జరిగింది.

విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది సరికొత్త రికార్డ్
విజయ్ దేవరకొండ గత చిత్రం ‘అర్జున్ రెడ్డి' టోటల్ థియేట్రికల్ రైట్స్ రూ. 6 కోట్ల అమ్ముడయింది. దాంతో పోల్చుకుంటే ‘గీత గోవిదం' రైట్స్ రెండున్నర రెట్లు ఎక్కువ. అర్జున్ రెడ్డి మూవీ వరల్డ్ వైడ్ రూ. 50 కోట్ల గ్రాస్, రూ. 25 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ రాబట్టింది. మరి గీత గోవిందం బిజినెస్ ఏ స్థాయిలో జరుగుతుంది? అనే అంశంపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Recommended Video


రొమాంటిక్ కామెడీ
రొమాంటిక్ కామెడీ మూవీ కావడంతో ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తుందని ఆశిస్తున్నారు. సినిమాపై ఇప్పటికే సూపర్ పాజిటివ్ బజ్ ఉండటంతో ఓపెనింగ్స్ బాగా వస్తాయని అంచనా వేస్తున్నారు. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.


Click it and Unblock the Notifications











