Geethanjali Malli Vachindi Collections బాక్సాఫీస్‌ను భయపెట్టిస్తున్న గీతాంజలి.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ నటి అంజలి నటించిన గీతాంజలి సినిమా క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లలో ట్రెండ్‌సెట్టర్‌గా నిలవడమే కాకుండా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. ఆ సినిమాకు సీక్వెల్‌గా గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు నటించారు. నూతన దర్శకుడు శివ తుర్లపాటి దర్శతక్వంలో MVV సినిమాస్‌తో కలిసి కోన ఫిల్మ్స్ కార్పొరేషన్‌పై కోన వెంకట్ నిర్మించారు. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, బ్రేక్ ఈవెన్ టార్గెట్ వివరాల్లోకి వెళితే..
తమిళ, తెలుగు సినిమాల్లో విశేషంగా రాణిస్తున్న హీరోయిన్ అంజలికి 50వ చిత్రం కావడం విశేషంగా మారింది. హారర్ కామెడీ జోనర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందింది. గీతాంజలి మళ్లీ వచ్చింది భారీ హంగులతో ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను సుమారుగా 6 కోట్ల రూపాయలతో నిర్మించినట్టు సమాచారం. ఇక ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేసుకొన్నట్టు ట్రేడ్ వర్గాల రిపోర్ట్. అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే.. కనీసం 4 కోట్ల రూపాయల షేర్.. 8 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

స్టార్ రైటర్ కోనా వెంకట్ నిర్మించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద రెస్పాన్స్ మంచిగానే ఉంది. ఇక మూవీకి యావరేజ్ కంటే ఎక్కువగానే ఆక్యుపెన్సీ కనిపించింది. మౌత్ టాక్ పెరిగితే.. ఇంకా ఆక్యుపెన్సీ పెరిగే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు ఊపందుకొనే అవకాశం ఉందని చెప్పారు. ఈ సినిమా తొలి రెండు రోజుల్లో 45 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసుకొన్నది.
ఈ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. ఈ సినిమా తొలి రోజు 50 లక్షల షేర్. 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక రెండో రోజు కూడా స్టడీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ మూవీ 2వ రోజు 50 లక్షల రూపాయల నికరంగా, 1 కోటి రూపాయలు గ్రాస్ వసూళ్లను నమోదు చేస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక తాజా అంచనాల ప్రకారం.. గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రం రెండు రోజుల్లో 2 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవర్ససీస్‌లో 50 లక్షల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా తొలి రెండు రోజుల్లో మొత్తంగా 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు పెరిగితే.. బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యే అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











