‘గీతాంజలి’ హిందీ రీమేక్ రైట్స్ ఎంతకు అమ్మారంటే

By Srikanya

హైదరాబాద్ : అంజలి, శ్రీనివాస్‌రెడ్డి ప్రధాన పాత్రల్లో రాజ్‌కిరణ్ దర్శకత్వంలో ఎం.వి.వి. సినిమా పతాకంపై కోన వెంకట్ సమర్పణలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘గీతాంజలి'. ఈ చిత్రం మూడు నెలల క్రితం విడుదలై మంచి హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రం హిందీలోనూ రీమేక్ కానుంది. ఈ మేరకు హిందీ రైట్స్ ని ఓ ప్రొడక్షన్ కంపెనీ వారు సొంతం చేసుకున్నట్లు సమాచారం. 70లక్షలకు ఈ ఎగ్రిమెంట్ కుదిరినట్లు సమాచారం. చిన్న సినిమాకు ఆ రేటు పలకటం విశేషమే అంటున్నారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

అంజలి మాట్లాడుతూ...‘‘నా కెరీర్‌లో తొలిసారి డబుల్‌ రోల్‌ చేశాను. ‘గీతాంజలి' హిట్‌ కావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చింది. నేనేంటో ఈ సినిమాతో నిరూపించుకున్నాను'' అని అంజలి అన్నారు. ఆమె నటించిన ‘గీతాంజలి' ఇటీవల విడుదలైంది బ్రహ్మానందం, శ్రీనివాసరెడ్డి, హర్షవర్ధన్‌ రాణే కీలక పాత్రల్లో నటించారు.

కోన వెంకట్‌ మాట్లాడుతూ ‘‘కంటెంట్‌ సరైంది పడితే సినిమా హిట్‌ అని గీతాంజలి నిరూపించింది. మంచి టీమ్‌ పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ సినిమా. రాజ్‌కిరణ్‌ రాసుకున్న కథను తన అనుమతితో హారర్‌ కామెడీగా మార్చాను. వరుసగా సినిమాలు చేయాలన్న తాపత్రయం మాకు లేదు. మంచి కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాం. మా సంస్థ తదుపరి చిత్రం బ్రహ్మానందంగారి తనయుడు గౌతమ్‌తో ఉంటుంది'' అని తెలిపారు.

Geethanjali sold out for 70 lakhs

కథలోకి వెళితే...సినిమా దర్శకుడు కావాలనే లక్ష్యంతో హైదరాబాద్ చేరుకుంటాడు శ్రీనివాసరెడ్డి. దిల్ రాజుకు కథ చెప్పి ఎలాగైన అవకాశం దక్కించుకోవాలని ట్రై చేస్తుంటాడు. ఈ క్రమంలో స్మశానం పక్కన ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటారు. శ్రీనివాసరెడ్డితో పాటు సత్యం, రాజేష్, జబర్దస్త్ శంకర్ కూడా అదే ఇంట్లో దిగుతారు. గతంలో ఆ ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి(అంజలి) దయ్యంగా మారి తిరుగూ ఉంటుంది. మరి దయ్యం కారణంగా వారు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు. శ్రీనివాసరెడ్డి తన లక్ష్య సాధనకు ఏం చేసాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

అంజలి తర్వాత శ్రీనివాసరెడ్డి సినిమాలో కీలకమైన పాత్ర పోషించాడు. పెర్ఫార్మెన్స్ పరంగా ఒకే అనిపించుకున్నాడు. సైతాన్ రాజ్ పాత్రలో బ్రహ్మానందం అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఎంటర్టెన్ చేసారు. సత్యం రాజేష్, జబర్దస్త్ శంకర్ కామెడీ ఆకట్టుకునే విధంగా ఉంది. రావు రమేష్ కీలకమైన పాత్రలో తనదైన నటన కనబరిచాడు. ఇతర నటీనటులు వారి వారి పాత్రల మేరకు రాణించారు. దిల్ రాజు తొలిసారిగా ఈ సినిమాలో తన నిజ జీవిత పాత్రలో తెరపై కనిపించారు.

మిగతా ముఖ్య పాత్రల్లో ...అలీ, రఘుబాబు, సత్యం రాజేష్, ఝాన్సీ, రావూరమేష్, హర్షవర్థన్ రాణె, వెనె్నల కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: శ్రీజో, ఎడిటింగ్: ఉపేంద్ర, కెమెరా: సాయిశ్రీరామ్, సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, మాటలు, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, నిర్మాత: ఎం.వి.వి.సత్యనారాయణ, కథ, దర్శకత్వం: రాజ్‌కిరణ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X