‘100% లవ్’ హిందీ రైట్స్ రేట్ ఎంతంటే
నాగచైతన్య, తమన్నా కాంబినేషన్ లో రూపొందిన '100% లవ్"చిత్రం హిట్ టాక్ తెచ్చుకోవటంతో దాని రీమేక్ రైట్స్ కీ మంచి పోటీ ఏర్పడింది. కలెక్షన్స్ సునామి సృష్టిస్తో న్న ఈ చిత్రం హిందీలో రీమేక్ చేయటానికి జెమినీ ఫిల్మ్ సర్కూట్ వారు ఈ రైట్స్ ని ఎనభై ఐదు లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ చిత్రాన్ని హీరోయిన్ ఓరియెంటెండ్ చిత్రంగా తీర్చిదిద్దాలని వారు ఆలోచిస్తున్నట్లు అందుకు అనుగుణంగా అక్కడ టాప్ హీరోయిన్ గా ఉన్న సోనాక్షి సిన్హాను తీసుకోనున్నట్లు చెప్తున్నారు. తెలుగులోనూ మొదట హీరోయిన్ పాయింటాఫ్ వ్యూలోనే కథ చెప్పి దానికి దటీజ్ మహాలక్ష్మి అనే టైటిల్ ని పెడదామని అనుకున్నారు. కానీ నాగార్జున పట్టుదలతో దానికి స్వస్ది చెప్పి హీరో వైపు నుంచి కథ నడిపారు. ఇక హిందీలోనూ సుకుమారే డైరక్ట్ చేస్తాడు కాబట్టి తనకు ఇష్టం వచ్చినట్లు తీస్తాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











