'రోబో' కోసం 'డాన్ శీను' నిర్మాతకు నాలుగు లక్షలు ఇచ్చి...
డాన్ శీను చిత్రం నిర్మాతకు తాజాగా నాలుగు లక్షలు ఇచ్చి జెమినీ ఫిలిమ్స్ వారు ధియోటర్ కోసం సెటిల్మెంట్ చేసుకున్నారని సమాచారం. దిల్ రాజు...బృందావనం చిత్రం కోసం బ్లాక్ చేసి ఉంచటం, మరికొన్ని ఖలేజా కోసం ధియోటర్స్ ని బుక్ చేసి ఉంచటంతో రోబోకు ధియోటర్స్ సమస్య ఎదురైంది. అందులోనూ తెలుగు నిర్మాత కన్నారావుకి బిజెనెస్ అనుభవం లేకపోవటం కూడా దెబ్బ తీసింది. దాంతో సన్ నెట్ వర్క్ వారి సూచన మేరకు నైజాం ఏరియాను తీసుకున్న జెమినీ ఫిల్మ్ వారు వారిపై ధియోటర్స్ భాద్యత పడింది. ఆర్టిసీ క్రాస్ రోడ్ లో మెయిన్ ధియోటర్ కోసం ...జెమినీ వారు ట్రై చేసారు. అందులో భాగంగా అక్కడ ఓడియన్ ధియోటర్ లో ఆడుతున్న డాన్ శీను ని తీసి వేరే ధియోటర్ కి షిప్ట్ చేయమన్నారు. వారు ఒప్పుకోకపోవటంతో నాలుగులక్షలు పే చేసి సమస్యను సాల్వ్ చేసుకున్నారని ట్రేడ్ లో వినపడుతోంది. ఇక రోబో చిత్రం ఈ రోజు ప్రపంచమంతటా రిలీజ్ అవుతోంది.


Click it and Unblock the Notifications











