ఫోటో టీవీ హక్కులు జెమినీకి!
సీనియర్ దర్శకుడు శివ నాగేశ్వరరావు ఫోటో అనే వినూత్న టైటిల్‌తో సినిమా తీస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆయన స్వయంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీవీ హక్కులను జెమిని టీవీ కొనుగోలు చేసినట్టు తెలిసింది. గతంలో మనీ, పట్టుకోండి చూద్దాం సిసింద్రి వంటి విజయవంతమైన సినిమాలు తీసిన శివనాగేశ్వరరావు ఇటీవల వరుస పరాజయాల కారణంగా తెరమరుగయ్యారు. వైవిధ్య భరితమైన కథలను ఎంచుకోవడం ఆయన ప్రత్యేకత. ఈ ఫోటో సినిమా కథ కూడా నిజంగా జరిగిందే. రెండున్నర ఏళ్ల క్రితం కోస్తా ఆంధ్రలో జరిగిన ఒక సంఘటన ఆధారంగా కథను రూపొందించారు. కళాశాలల్లో ఉండే ప్రధాన సమస్య కథకు మూలం. ఈ సినిమాలు రెండు పాటలు మాత్రమే ఉంటాయి. ఈ సినిమా ఆగస్టు మొదటి వారంలో విడుదల కానుంది.


Click it and Unblock the Notifications