Don't Miss!
- News కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారును ఏకిపారేసిన కేసీఆర్
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
జార్జ్ రెడ్డి వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ దిశగా.. ఇంకెంత రాబట్టాలంటే..?
ఉస్మానియా గడ్డపై అసువులుభాసిన విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జ్ రెడ్డి. చివర శ్వాస వరకు తాను నమ్మిన సిద్దాంతాలకే కట్టుబడి శత్రుమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరుడు జార్జ్ రెడ్డి. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిందే జార్జ్ రెడ్డి. వంగవీటి ఫేమ్ సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి పాత్రను పోషించిన ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు రాగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.
మెగా సపోర్ట్‌తో అంచనాలు..
జార్జ్ రెడ్డి చిత్రం షూటింగ్లో ఉండగా ఎవరికీ ఎలాంటి అంచనాలు లేకపోయినా.. టీజర్, ట్రైలర్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ట్రైలర్లో చూపించిన విజువల్స్, మేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. అలా మెల్లిమెల్లిగా జార్జ్ రెడ్డికి మెగా ఫ్యామిలీ అండ దొరికింది. చిరంజీవి చేతుల మీదుగా ఓ సాంగ్‌ను కూడా విడుదల చేయించింది చిత్రబృందం.
ఎన్నో వివాదాల నడుమ..
1970 ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన జార్జ్ రెడ్డిపై మొదట్లో అంచనాలు లేకపోయినా.. రానురాను తారాస్థాయికి చేరుకున్నాయి. జార్జ్ రెడ్డి చిత్రానికి రాజకీయ రంగు పులుముకుంటూ వచ్చింది. జార్జ్ రెడ్డి విడుదలపై హెచ్చరికలు, బెదిరింపులు కూడా వచ్చాయి.
ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్లు..
ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే.. మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో వసూళ్లు కూడా పుంజుకున్నాయి. ఈ సినిమా మొదటి రోజే దాదాపు కోటికి పైగా గ్రాస్‌ను కొల్లగొట్టినట్టు టాక్. అన్ని ఏరియాల నుంచి మంచి వసూల్లే వచ్చాయని ట్రేడ్ పండితులు తెలిపారు.
ఐదో రోజూ అదే జోరు..
మూవీ విడుదలై ఐదు రోజులవుతున్న ఈ చిత్ర వసూళ్లు నిలకడ ఉన్నాయని తెలుస్తోంది. ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపు 17లక్షలను కొల్లగొట్టగా.. ప్రపంచవ్యాప్తంగా 18లక్షలను వసూళ్లను చేసినట్టు టాక్. మొత్తంగా ఈ చిత్రం ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 3.95కోట్ల గ్రాస్, 2.26కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.
Recommended Video
ఇంకెంత రాబట్టాలంటే..?
ఈ చిత్రం దాదాపు మూడు కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 2.26కోట్లను వసూల్ చేయడంతో మిగిలిన 74లక్షలను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. కానీ వారాంతంలో కొత్త సినిమాలు బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాయి..వాటి నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని మరో వారం నిలబడతాడా? లేదా? అన్నది చూడాలి.