twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జార్జ్ రెడ్డి వసూళ్లు.. బ్రేక్ ఈవెన్ దిశగా.. ఇంకెంత రాబట్టాలంటే..?

    |

    ఉస్మానియా గడ్డపై అసువులుభాసిన విద్యార్థి ఉద్యమ నాయకుడు జార్జ్ రెడ్డి. చివర శ్వాస వరకు తాను నమ్మిన సిద్దాంతాలకే కట్టుబడి శత్రుమూకల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరుడు జార్జ్ రెడ్డి. అలాంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిందే జార్జ్ రెడ్డి. వంగవీటి ఫేమ్ సందీప్ మాధవ్ జార్జ్ రెడ్డి పాత్రను పోషించిన ఈ చిత్రం గత వారం ప్రేక్షకుల ముందుకు రాగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

    మెగా సపోర్ట్‌తో అంచనాలు..

    మెగా సపోర్ట్‌తో అంచనాలు..

    జార్జ్ రెడ్డి చిత్రం షూటింగ్‌లో ఉండగా ఎవరికీ ఎలాంటి అంచనాలు లేకపోయినా.. టీజర్, ట్రైలర్‌తో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ట్రైలర్‌లో చూపించిన విజువల్స్, మేకింగ్‌కు అందరూ ఫిదా అయ్యారు. అలా మెల్లిమెల్లిగా జార్జ్ రెడ్డికి మెగా ఫ్యామిలీ అండ దొరికింది. చిరంజీవి చేతుల మీదుగా ఓ సాంగ్‌ను కూడా విడుదల చేయించింది చిత్రబృందం.

    ఎన్నో వివాదాల నడుమ..

    ఎన్నో వివాదాల నడుమ..

    1970 ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా తెరకెక్కిన జార్జ్ రెడ్డిపై మొదట్లో అంచనాలు లేకపోయినా.. రానురాను తారాస్థాయికి చేరుకున్నాయి. జార్జ్ రెడ్డి చిత్రానికి రాజకీయ రంగు పులుముకుంటూ వచ్చింది. జార్జ్ రెడ్డి విడుదలపై హెచ్చరికలు, బెదిరింపులు కూడా వచ్చాయి.

    ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్లు..

    ఫస్ట్ డే అదిరిపోయే కలెక్షన్లు..

    ఈ చిత్రం విడుదలైన మొదటి రోజే.. మంచి టాక్‌ను సొంతం చేసుకోవడంతో వసూళ్లు కూడా పుంజుకున్నాయి. ఈ సినిమా మొదటి రోజే దాదాపు కోటికి పైగా గ్రాస్‌ను కొల్లగొట్టినట్టు టాక్. అన్ని ఏరియాల నుంచి మంచి వసూల్లే వచ్చాయని ట్రేడ్ పండితులు తెలిపారు.

     ఐదో రోజూ అదే జోరు..

    ఐదో రోజూ అదే జోరు..

    మూవీ విడుదలై ఐదు రోజులవుతున్న ఈ చిత్ర వసూళ్లు నిలకడ ఉన్నాయని తెలుస్తోంది. ఐదో రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దాదాపు 17లక్షలను కొల్లగొట్టగా.. ప్రపంచవ్యాప్తంగా 18లక్షలను వసూళ్లను చేసినట్టు టాక్. మొత్తంగా ఈ చిత్రం ఐదు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా 3.95కోట్ల గ్రాస్, 2.26కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

    Recommended Video

    CineBox: Chiranjeevi Imitates Pawan Kalyan | Ali Reza To Act In a Crazy Movie
    ఇంకెంత రాబట్టాలంటే..?

    ఇంకెంత రాబట్టాలంటే..?

    ఈ చిత్రం దాదాపు మూడు కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు 2.26కోట్లను వసూల్ చేయడంతో మిగిలిన 74లక్షలను రాబడితే బ్రేక్ ఈవెన్ సాధించినట్టే. కానీ వారాంతంలో కొత్త సినిమాలు బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాయి..వాటి నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకుని మరో వారం నిలబడతాడా? లేదా? అన్నది చూడాలి.

    English summary
    George Reddy Day 5 World Wide Box office Collections. Sandeep Madhav Play As George Reddy. Jeevan reddy Directed This Movie While Appi reddy Is Produced.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X