జార్జ్‌రెడ్డి ఫస్ట్ డే కలెక్షన్లు: హిట్టా? ఫట్టా? ఎంత వసూలు చేసిందంటే!

ఉస్మానియా గడ్డ మీద దారుణ హత్యకు గురైన విద్యార్థి నాయకుడు జార్జ్ రెడ్డి. భావజాలం, సిద్ధాంతపరమైన అంశాలను పక్కన పెడితే.. కొన్ని తరాలకు ఉద్యమస్ఫూర్తిగా నిలిచిన విద్యార్థి నాయకుడు జార్జిరెడ్డి. ఉస్మానియా యూనివర్సిటీలో చోటుచేసుకొన్న కుల, పెట్టుబడిదారీ, రౌడీ మూకలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ 45 ఏళ్ల కిందట అమరుడయ్యాడు. చరిత్ర విస్మరించిన ఆ యోధుడి గాథను జార్జ్ రెడ్డి అంటూ తెరపైకి తీసుకొచ్చారు. ఈ చిత్రం శుక్రవారం (నవంబర్ 22)న విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.

చిన్న సినిమాగా ప్రారంభమైనా..

చిన్న సినిమాగా ప్రారంభమైనా..

జార్జ్ రెడ్డి అనే చిత్రం చిన్న సినిమాగా మొదలైనా.. ట్రైలర్‌తో అంచనాలు పెంచేశారు. ట్రైలర్‌తో ఈ చిత్రం ఎలా ఉండబోతోందనే హింట్ ఇచ్చారు. నాటి ఉస్మానియా పరిస్థితులు, అప్పటి వాతావరణాన్ని ఎంతో సహజంగా చూపిస్తూ కట్ చేసిన ట్రైలర్ ఎందర్నో ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో అలా అలా విస్తరిస్తూ వచ్చిన జార్జ్ రెడ్డి.. మంచి హైప్‌ను క్రియేట్ చేసుకుంది.

మొదటి రోజే అదిరిపోయే వసూళ్లు..

మొదటి రోజే అదిరిపోయే వసూళ్లు..

ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున రిలీజ్ చేశారు. అందుకు తగ్గట్టే ఈ మూవీ కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా మొదటి రోజే దాదాపు కోటి రూపాయలకు పైగా (1.2) గ్రాస్‌ను రాబట్టిందని సమచారం. రెండు తెలుగు రాష్ట్రాలలో 61 లక్షల షేర్‌ని వసూల్ చేసింది, వరల్డ్ వైడ్‌గా 73 లక్షల షేర్‌ని సినిమా సాధించిందని తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో హవా..

తెలుగు రాష్ట్రాల్లో హవా..

తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం దూసుకుపోయింది. ఏరియాల వారిగా అన్ని చోట్ల హౌస్‌ఫుల్ కలెక్షన్లతో టాప్ లేపుతోంది. నైజాంలో 26లక్షలు, సీడెడ్ 7లక్షలు, తూ.గో 4లక్షలు, ప.గో 3.1లక్షలు, గుంటూరు 4లక్షలు, కృష్ణ 4.5లక్షలు, నెల్లూరు 2.1లక్షలు మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 61 లక్షల వసూళ్లను రాబట్టి సత్తా చాటుకుంది.

ఇండియా వైడ్‌గా..

ఇండియా వైడ్‌గా..

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో విడుదల చేసిన జార్జ్ రెడ్డి చిత్రానికి మంచి స్పందన వచ్చింది. అక్కడ కూడా డీసెంట్ కలెక్షన్లతో పర్వాలేదనిపించింది. ఈ చిత్రం కర్ణాటక, రెస్టాఫ్ ఇండియాలో కలిపి 4లక్షలను కొల్లగొట్టినట్టు టాక్.

 ఓవర్సీస్‌లోనూ సత్తా చాటిన జార్జ్ రెడ్డి..

ఓవర్సీస్‌లోనూ సత్తా చాటిన జార్జ్ రెడ్డి..

ఓవర్సీస్‌లో జార్జ్ రెడ్డి మొదటి రోజున బాగానే రాబట్టాడు. అక్కడా మంచి బజ్ ఏర్పడటంతో ఫస్ట్ డే కలెక్షన్లు కూడా బాగానే ఉన్నాయి. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 8లక్షలు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. మొత్తంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 73లక్షలను కొల్లగొట్టగా.. 1.2కోట్ల గ్రాస్‌ను రాబట్టింది.

Recommended Video

George Reddy Movie Review And Rating
 ఇంకో రెండు రోజుల్లో..

ఇంకో రెండు రోజుల్లో..

ఈ మూవీ బిజినెస్ రెండున్నర కోట్ల నుంచి మూడు కోట్ల వరకు జరిగినట్టు సమాచారం. మొదటి రోజే కోటి దాకా వసూళు చేయగా.. ఇదే జోరును కొనసాగిస్తే.. ఇంకో రెండో రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ వారంలో విడుదలైన అన్ని చిత్రాల్లోకెల్లా జార్జ్ రెడ్డి చిత్రానికి కాస్త హైప్ ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X