కంగ్రాట్స్...అల్లు అరవింద్

By Staff

Allu Aravind
అల్లు అరవింద్ మళ్ళి జాతీయ స్ధాయిలో వార్తల్లో నిలిచారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించిన గజనీ సూపర్ హిట్ అవటంతో ఎక్కడెక్కడ వాళ్ళూ ఆయనకు కంగ్రాట్స్ చెపుతున్నారు. మొదటి వారమే ఈ సినిమా దాదాపు డబ్బై కోట్ల దాకా కలెక్టు చేస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ఈ సినిమా రిలీజుకు ముందే భారీ మొత్తానికి అమ్మటంతో ముప్పై కోట్ల పైగానే టేబుల్ ప్రాపెట్ సంపాదించారు.

అమీర్ ఖాన్,అసిన్ జంటగా నటించిన ఈ చిత్రం తమిళంలో సూర్య హీరోగా చేసిన గజనీకి రీమేక్. తమిళంలో చేసిన ఎ.ఆర్.మురగదాసే ఈ సినిమానూ హిందీలో రూపొందించారు. అలాగే ప్రత్యేక శ్రద్ద తీసుకుని అమీర్ ఖాన్ చేసిన పబ్లిసిటీ కూడా ధియేటర్స్ ని హౌస్ ఫుల్స్ తో నింపటానికి సాయపడింది. బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకుల అంచానాల ప్రకారం షారూఖ్ రబ్ నే బనాదే జోడి కి మూడు రెట్లు కలెక్షన్స్ వసూలు చేసే చిత్రంగా ఇది నిలబడుతుందని సమాచారం.ప్రపంచం మొత్తం మీద 1, 450 ప్రింట్లతో రిలీజైన ఈ చిత్రం టి్క్కట్లు రెండు వారాల పాటు అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్ అయిపోయాయి. ఆ మధ్య రిలీజైన అక్షయ్ కుమార్ సింగ్ ఈజ్ కింగ్ మాత్రమే ఈ రేంజి ఓపినింగ్స్ ని తెచ్చుకుంది.

ఇక ఈ హిట్ తో అల్లు అరవింద్ వైపు బాలీవుడ్ ప్రపంచం ఒక్కసారిగా దృష్టి సారిస్తోంది. వాస్తవానికి ఈ ప్రాజెక్టులో అరవింద్ ప్రత్యక్ష్య ప్రమేయం లేకపోయినా ఇంత అనూహ్య విజయం సాధించటం బ్యానర్ వ్యాల్యూని పెంచటమే గాక విపరీతమైన ఆనందిస్తోందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కంగ్రాట్స్ అరవింద్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X