Ghilli Re Release Box office: క్రేజీగా గిల్లీ రీ రిలీజ్ బాక్సాఫీస్ వసూళ్లు.. విజయ్ సినిమాకు ఎన్ని కోట్లంటే?
తమిళ సూపర్ స్టార్ విజయ్, త్రిష కృష్ణన్ జంటగా రూపొందిన సినిమా గిల్లీ. తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన ఒక్కడు చిత్రం రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమా 2004 సంవత్సరంలో రిలీజై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రానికి ధరణి దర్శకత్వం వహించారు. శ్రీసూర్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను ఏఏం రత్నం నిర్మించారు. ఈ మూవీలో ప్రకాశ్ రాజ్, ఆశీష్ విద్యార్థి, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం తదితరులు నటించారు.
ఈ సినిమాకు ఎస్ గోపినాథ్ సినిమాటోగ్రఫి, విద్యాసాగర్ సంగీతం, బీ లెనిన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ చిత్రం 2004 సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన గ్రాండ్‌గా రిలీజైంది. అయితే ఈ సినిమా గతేడాది రిలీజై సంచలనం సృష్టించింది. అయితే విజయ్‌కి తమిళనాడులో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని మరోసారి ఫిబ్రవరి 20వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సినిమా వసూలు చేసిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ఈ సినిమాను 8 కోట్ల బడ్జెట్‌తో నిర్మించగా.. ఈ చిత్రం అప్పట్లో 42 కోట్ల రూపాయలు రాబట్టింది. గతేడాది ఈ సినిమాను రిలీజ్ చేయగా బాక్సాఫీస్ వద్ద సుమారుగా 26 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ చిత్రం ఇప్పటి వరకు 68 కోట్ల రూపాయలు వసూలు చేసింది. నిర్మాతకు భారీ లాభాన్ని పంచిపెట్టింది.
తాజాగా గిల్లీ సినిమాను తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లో రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని 110 పట్టణాల్లో 250 లోకేషన్లలో 275 స్క్రీన్లలో ప్రదర్శించారు. దాదాపుగా ఈ చిత్రం 50 వేల టికెట్లను అమ్మడం జరిగింది. దాంతో ఈ సినిమా తొలి రోజు సుమారుగా 1 కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
ఈ చిత్రం మొదటి రోజు కంటే రెండో రోజు భారీగా వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్ క్రేజీగా నమోదు అవుతున్నది. దాదాపు 60 వేల టికెట్లు అమ్మడుపోయాయి. దాంతో ఈ చిత్రం 2వ రోజు 1.25 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా రెండు రోజుల్లో 2.25 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని అంచనా వేశారు.


Click it and Unblock the Notifications











