Ghilli Collectionsబాక్సాఫీస్ వద్ద గిల్లీ శివతాండవం..సౌత్ ఇండస్ట్రీలో విజయ్ రికార్డ్ బ్రేక్ కలెక్షన్లు..

తెలుగు సినిమా పరిశ్రమలో సంచలన విజయం సాధించడమే కాకుండా మహేష్ బాబుకు స్టార్ డమ్‌ను తెచ్చిపెట్టిన చిత్రం ఒక్కడు. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తమిళంలో ఇళయదళపలి విజయ్ హీరోగా ధరణి దర్శకత్వంలో గిల్లీగా తెరకెక్కింది. ఈ చిత్రం కూడా తమిళంలో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకొన్నది. అయితే విజయ్ రాజకీయ ప్రవేశం చేసిన నేపథ్యంలో ఈ సినిమాను తమిళనాడు, ఓవర్సీస్‌లో రీ రిలీజ్ చేయగా బాక్సాఫీస్ వద్ద సంచలన రీతిలో వసూళ్లను రాబడుతున్నది. ఈ సినిమా రీరిలీజ్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం నిర్మాణంలో గిల్లీ సినిమాను సుమారుగా 8 కోట్ల రూపాయలతో నిర్మించారు. అయితే ఈ సినిమా తెలుగులో మాదిరిగానే రికార్డు కలెక్షన్లను బాక్సాఫీస్ వద్ద రాబట్టింది. ఎన్నో వారాలు విజయవంతంగా ఆడిన ఈ చిత్రం థియేట్రికల్ రన్‌ పూర్తయిన తర్వాత లెక్కిస్తే.. 50 కోట్ల షేర్ సాధించింది.

Ghilli Movie Re Release Collections Worldwide Vijay Movie rocking with Records at Box Office

అలాంటి బాక్సాఫీస్ చరిత్ర ఉన్న విజయ్ సినిమాను తాజాగా మరోసారి విడుదల చేశారు. ఈ సినిమాకు అభిమానుల నుంచి భారీ స్పందన రావడంతో భారీ అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. దక్షిణాదిలో రీరిలీజ్ అయిన సినిమాల్లో గిల్లీ మూవీ చరిత్ర సృష్టించింది. అత్యధిక వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

విజయ్ నటించిన ఈ చిత్రం తమిళనాడులోనే కాకుండా కేరళ, కర్ణాటకలో రికార్డు వసూళ్లను నమోదు చేసింది. అయితే ఈ సినిమా టికెట్ల ధరను భారీగా తగ్గించి అమ్మకాలు చేపట్టారు. ఒకవేళ సాధారణ ధరకు టికెట్స్ అమ్మితే రికార్డులు తిరిగరాసే అవకాశం ఉండేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ సినిమాకు అత్యధిక ఫుట్‌ఫాల్స్ నమోదు అయ్యాయి.

గిల్లీ సినిమాకు ఓవర్సీస్‌లో కూడా భారీ వసూళ్లు సాధించింది. సింగపూర్‌లో తొలి రోజు 47 వేల సింగపూర్ డాలర్లు వసూలు చేసింది. ఇక అమెరికా, ఇతర దేశాల్లో కూడా అత్యధిక వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా తొలి రోజు 400K అంటే.. సుమారుగా 4 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా గిల్లీ చిత్రం తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం 4.5 కోట్లు తమిళనాడులో, 1 కోటి రూపాయలు ఇతర రాష్ట్రాల్లో వసూలు చేసింది. ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు కలిపితే ఈ చిత్రం 9.5 కోట్ల రూపాయలు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక రెండో రోజు 10 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X