Ghilli Collections గిల్లీ కలెక్షన్ల సంచలనం.. విజయ్ బాక్సాఫీస్ మాస్ ఊచకోత.. ఎన్ని కోట్లంటే?
తమిళ ఇళయ దళపతి విజయ్ నటించిన గిల్లీ చిత్రం బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తున్నది. తెలుగులో బ్లాక్ బస్టర్ మూవీ ఒక్కడు సినిమా ఆధారంగా రూపొందిన ఈ సినిమా తాజాగా తమిళనాడు, ఓవర్సీస్‌లో రి రీలీజ్ అయింది. అయితే ఇప్పటి వరకు దక్షిణాదిలో రీ రిలీజ్ అయిన సినిమాల్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన తొలి చిత్రంగా ఒక రికార్డును క్రియేట్ చేసింది. ఈ సినిమా 5వ రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో కొత్త సినిమాలతో పోటీ పడుతూ వాటి కంటే ఎక్కువ కలెక్షన్లు సాధిస్తున్న చిత్రంగా గిల్లీ రికార్డులు బ్రేక్ చేస్తున్నది. స్టార్ హీరో విజయ్ బాక్సాఫీస్ స్టామినాను ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. గత 4 రోజుల్లో ఈ చిత్రం 10 కోట్ల 25 లక్షల రూపాయలు కలెక్ట్ చేసిందని అధికారికంగా డిస్ట్రిబ్యూటర్లు వెల్లడించారు.

గిల్లి సినిమా టికెట్లు రేట్లు తగ్గించకపోతే ఈ సినిమా ఇప్పటికే 20 నుంచి 30 కోట్ల రూపాయలు వసూలు చేసేదని డిస్టిబ్యూటర్లు అన్నారు. ఒకవేళ ఈ సినిమాను పండుగ సీజన్‌లో కనుక రిలీజ్ చేసి ఉంటే.. హయ్యెస్ట్ ఫుట్‌ఫాల్స్ ఉండేవని, అంతేకాకుండా అత్యధిక కలెక్షన్లు సాధించే ఛాన్స్ ఉండేదని అభిప్రాయపడ్డారు.
ఇక ఆస్ట్రేలియా, యూకే, యూఎస్ఏ లాంటి దేశాల్లో విజయ్ సినిమాకు భారీ ఆదరణ కనిపిస్తున్నది. కొత్త సినిమాల కంటే గిల్లి సినిమాకే ఎక్కువ ఆక్యుపెన్సీ ఉందని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే 3 కోట్లకుపైగా వసూళ్లను ఓవర్సీస్ మార్కెట్‌లో వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

ఇక గిల్లీ సినిమా తొలి రోజు రికార్డు స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా 7.75 కోట్లు రాబట్టింది. ఇండియాలోనే ముఖ్యంగా తమిళనాడుతో కలిపి ఈ మూవీ 4.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. గత 5 రోజుల్లో ఈ మూవీ 11.75 కోట్ల రూపాయలు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 15 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది.
దక్షిణాది సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమాకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రీ రిలీజ్ చిత్రంగా రికార్డు ఉండేది. ఈ రికార్డును గిల్లి తిరగరాసింది. అంతేకాకుండా లాల్ సలామ్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్ల రికార్డును కూడా తిరగరాసేందుకు సిద్దమైంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











