Ghilli Closing Collections అవతార్, షోలే, ఖుషి రికార్డులు బ్రేక్.. రజనీ, పవన్‌పై విజయ్ పైచేయి..

తమిళ ఇళయ దళపతి, సూపర్ స్టార్ విజయ్ నటించిన గిల్లీ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు బ్రేక్ కలెక్షన్లు సాదించింది. విజయ్ కెరీర్‌లో హిట్టుగా నిలిచిన తెలుగు ఒక్కడు రీమేక్ చిత్రాన్ని ఇటీవల తమిళనాడు, ఓవర్సీస్‌లో కొన్ని ప్రాంతాల్లో రిలీజ్ చేయగా అనూహ్యమైన కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం 2024లో విడుదలైన కొన్ని టాప్ హీరోల సినిమాల కంటే అధికంగా వసూళ్లు రాబట్టడం విశేషంగా మారింది. గిల్లీ సినిమా కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..

త్రిష హీరోయిన్‌గా ఏఎం రత్నం నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైన రీ రిలీజ్ చిత్రాల్లో బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. 13 రోజులుగా తమిళంలో, విదేశాల్లో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం తొలి నాలుగు రోజుల్లోనే 5 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఈ చిత్రం థియేట్రికల్ రన్‌లో 24 కోట్ల రూపాయలను తమిళనాడులోనే వసూలు చేసింది.

Ghilli Re Release Closing Collections worldwide Vijay movie breaks avatar and Sholay box Office Numbers

ఇక గిల్లీ చిత్రం అమెరికా, గల్ఫ్, యూకే, నార్వే, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో రికార్డు వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో 6.5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం 30 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను వసూలు చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో రీ రిలీజైన సినిమాల్లో ఇదే అత్యుత్తమ వసూళ్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తమిళనాడులో ఈ ఏడాది రిలీజైన లాల్ సలామ్, కెప్టెన్ మిల్లర్ లాంటి సినిమాల కంటే అధికంగా వసూళ్లు రాబట్టింది. రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ సినిమా స్థానికంగా 21 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సైరెన్ చిత్రం 21 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా రీ రిలీజ్ సినిమాల విషయంలో సరికొత్త మైలురాయిని సెట్ చేసింది.

Ghilli Re Release Closing Collections worldwide Vijay movie breaks avatar and Sholay box Office Numbers

దక్షిణాది సినిమా పరిశ్రమలో ఇప్పటి వరకు పవన్ కల్యాణ్ నటించిన ఖుషీ సినిమాకు అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రీ రిలీజ్ చిత్రంగా రికార్డు ఉండేది. 10 కోట్ల రూపాయలకుపైగా కలెక్షన్లను సాధించింది. అయితే ఈ రికార్డును గిల్లి తిరగరాసింది. ఈ సినిమా విజయ్ బాక్సాఫీస్ స్టామినా ఏమిటో తెలియజెప్పింది.

ఇక అవతార్, షోలే సినిమా రీ రిలీజ్ కలెక్షన్లను బ్రేక్ చేసింది. 2012 సంవత్సరంలో అవతార్ 3డీ చిత్రం 18 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక షోలే 3డీ చిత్రం 13 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ రెండు సినిమాల రికార్డులను కూడా తిరగరాసి సరికొత్త చరిత్రను నెలకొల్పింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X