Ghilli Collections విజయ్ బాక్సాఫీస్ ఊచకోత.. పవన్ కల్యాణ్, రజనీ రికార్డులు మటాష్
దక్షిణాదిలో ఇప్పటి వరకు విడుదలైన పలు హీరోల రీరీలీజ్ చిత్రాలన్నీ రికార్డులను గిల్లీ తుడిచిపెట్టేసింది. ఈ సినిమా మూడో రోజు కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా స్టార్ హీరోల సినిమాల తొలి రోజు కలెక్షన్లను మించి వసూళ్లను రాబట్టడం సెన్సేషనల్‌గా మారింది. ఇండియన్ ట్రేడ్ అనలిస్టుల ఊహకు అందకుండా ఈ సినిమా బాక్సాఫీస్ నంబర్స్ నమోదు కావడం విశేషంగా మారింది. ఈ సినిమా మూడో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
గిల్లీ చిత్రానికి ఓవర్సీస్‌లో భారీ వసూళ్లను రాబడుతున్నది. ఓవర్సీస్‌లో సింగపూర్, ఫ్రాన్స్, యూకే, అమెరికాలో ఈ సినిమా రికార్డు కలెక్షన్లను రాబట్టడం క్రేజీగా మారింది. ఈ చిత్రం తొలి రోజును మించి రెండో రోజు, రెండు రోజులను మంచి మూడో రోజు కలెక్షన్లు సాధించడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.

తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ థియేటర్స్‌కు పోటెత్తుతున్నారు. కరెంట్ బుకింగ్, అడ్వాన్స్ బుకింగ్‌కు భారీ స్పందన లభిస్తున్నది. ఈ సినిమా రెండు రోజుల్లోనే తమిళనాడులో సుమారుగా 8.5 కోట్ల రూపాయల కలెక్షన్లను రాబట్టడంతో ట్రేడ్ వర్గాలు ముక్కున వేలేసుకొంటున్నారు. ఈ సినిమా రానున్న రోజుల్లో కూడా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గిల్లీ మూవీ రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ సినిమా తమిళనాడులో 4.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు ఈ సినిమా 3.75 కోట్లు రాబట్టింది. దాంతో రెండు రోజుల్లోనే 8.5 కోట్లు వసూలు చేసింది. మిగితా ప్రాంతాల్లో ఈ సినిమా 1 కోటి రూపాయలు వసూలు చేసింది. ఇక ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు కలిపితే ఈ చిత్రం 12.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇక మూడో రోజు కూడా తమిళనాడు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్‌గా కనిపించింది. ఈ చిత్రం 3వ రోజు కూడా 3 కోట్లకుపైగా వసూళ్లను సాధిస్తుందని అంచనా వేశారు. ఈ చిత్రం మూడు రోజుల్లో కనీసం 12 కోట్లు తమిళనాడులోనే నమోదు చేయవచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 13 కోట్లు వసూలు చేస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు రిలీజైన రీరిలీజ్ చిత్రాల్లో గిల్లీ చిత్రం రికార్డు క్రియేట్ చేసింది. దక్షిణాదిలో ఇప్పటి వరకు ఉన్న పవన్ కల్యాణ్ నటించిన ఖుషి సినిమా రికార్డులను అధిగమించింది. అంతేకాకుండా తమిళనాడులో ఇటీవల విడుదలైన స్ట్రయిట్ సినిమాలు లాల్ సలామ్, కెప్టెన్ మిల్లర్, గాడ్డిల్లా వర్సెస్ కాంగ్, ఆయలాన్ సినిమాల ఒపెన్సింగ్ కంటే అధికంగా వసూళ్లు సాధించింది.
ఇక గిల్లీ సినిమా రీ రిలీజ్ థియేట్రికల్ రన్‌లో మొత్తంగా 25 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ సినిమా టికెట్ రేట్లను భారీగా తగ్గించి డిస్కౌంట్ రేట్‌కు అమ్మిన తర్వాత కూడా ఈ రేంజ్ వసూళ్లు సాధించడం మరో ఘనత అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా 8 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించగా.. వరల్డ్ వైడ్‌గా 40 కోట్లు వసూలు చేసింది.


Click it and Unblock the Notifications











