Ghost Collections శివ రాజ్‌కుమార్ మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జయరాం, అనుపమ్ ఖేర్, ప్రశాంత్ నారాయన్, అర్చన జోస్, సత్య ప్రకాశ్ తదితరులు నటించిన ఘోస్ట్ (Ghost) చిత్రం అక్టోబర్ 19వ తేదీన కన్నడతోపాటు కొన్ని చోట్ల రిలీజైంది. ఈ సినిమాకు ఎంజీ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బడ్జెట్, ప్రీ రిలీజ్ బిజినెస్, కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
యాక్షన్, థ్రిల్లర్‌గా రూపొందిన ఘోస్ట్ చిత్రాన్ని సుమారుగా 20 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఇతర భాషలకు చెందిన స్టార్ నటులు ఉండటంతో బడ్జెట్ భారీగానే అయింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్‌ను 10 కోట్లుగా వ్యాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే కనీసం 10 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. ఇక ఈ సినిమాకు కన్నడ ప్రేక్షకుల నుంచి మంచి క్రేజ్ రావడంతో ప్రపంచవ్యాప్తంగా 2000 స్క్రీన్లలో రిలీజ్ చేశారు.

శివరాజ్ కుమార్‌కు కన్నడలో ఉన్న ఫాల్ ఫాలోయింగ్‌తో భారీగానే రెస్పాన్స్ లభించింది. ఈ సినిమా డివైడ్ టాక్‌తో భారీ కలెక్షన్లను రాబట్టింది. తొలి రోజు కన్నడలో 2.5 కోట్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొత్తంగా 4 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. శివరాజ్ కుమార్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
ఘోస్ట్ సినిమా రెండో రోజు ఆక్యుపెన్సీ విషయానికి వస్తే.. తొలి రోజు భారీ వసూళ్లు సాధించిన తర్వాత రెండో రోజు కలెక్షన్ల కొంత ఆక్యుపెన్సీ తగ్గింది. మార్నింగ్ షోకు 35 శాతం ఆక్యుపెన్సీ, మ్యాట్నీకి ఆక్యుపెన్సీ పెరిగి 40 శాతం, ఫస్ట్ షోకు 45 శాతం ఆక్యుపెన్సీ, సెకండ్ షోకు 50 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది.

ఘోస్ట్ సినిమా రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఓ రేంజ్ కలెక్షన్లు సాధించింది. రెండో రోజున కన్నడలో 1.5 కోట్లు రాబట్టే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మిక్స్‌డ్ టాక్ కారణంగా ఈ సినిమా భారీగా కలెక్షన్లు రాబట్టలేకపోవడం ఓ కారణం కాగా, లియో, భగవంత్ కేసరి లాంటి సినిమాల పోటీ ఎక్కువగా కనిపించింది. లాంగ్ రన్‌లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ుంది.


Click it and Unblock the Notifications











