Ginna Day 1 Collections యూఎస్‌‌లో దారుణమైన రికార్డు .. మంచు విష్ణు తొలి రోజు కలెక్షన్లు ఎంతంటే?

విష్ణు మంచు హీరోగా సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్లుగా నటించిన జిన్నా చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా రిలీజ్‌కు ముందే రకరకాల ట్రోల్స్ రావడంతో ఈ సినిమాపై ఒకరకమైన ఆసక్తి పెరిగింది. దాంతో ఈ సినిమా కలెక్షన్లపై మరింత క్యూరియాసిటీ అందరిలోను కలిగింది. అయితే దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజైన జిన్నా చిత్రం తొలి రోజు ఏ రేంజ్ కలెక్షన్లు రాబట్టిందంటే?

మంచు ఫ్యామిలీ సినిమాలు నిరాశతో

మంచు ఫ్యామిలీ సినిమాలు నిరాశతో

మంచు ఫ్యామిలీ ప్రొడక్షన్ నుంచి వచ్చిన గత చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ నిరాశను మిగిల్చాయి. కొద్ది సంవత్సరాలుగా మంచు ఫ్యామిలీ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయనేది కలెక్షన్ల రికార్డులు స్పష్టం చేశాయి. తాజాగా వచ్చిన సన్నాఫ్ ఇండియా చిత్రం దారుణమైన ఫ్లాప్‌ను మూటగట్టుకొన్నది. దీంతో జిన్నా అలాంటి ట్రెండ్‌కు బ్రేక్ వేస్తుందా అనే చర్చల మధ్య ఈ సినిమా రిలీజైంది.

తెలుగులో ప్రీ రిలీజ్ బిజినెస్

తెలుగులో ప్రీ రిలీజ్ బిజినెస్

జిన్నా సినిమాపై భారీ ఆశలు పెట్టుకొన్న మంచు విష్ణు బిజినెస్‌ను కూడా ఆ రేంజ్‌లో రాబట్టాలనే ప్రయత్నం చేశారు. అయితే బయ్యర్లు ముఖం చాటేయడంతో కష్టం మీద ఈ సినిమాను ఆంధ్రా, తెలంగాణలో ఓవరాల్‌గా 3 కోట్ల వద్ద ఫినిష్ చేసినట్టు సమాచారం. ఇక కర్ణాటకలో 25 లక్షలకు ఈ సినిమా బిజినెస్ క్లోజ్ చేసినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

జిన్నా మూవీ అక్యుపెన్సీ

జిన్నా మూవీ అక్యుపెన్సీ

జిన్నా మూవీ దేశవ్యాప్తంగా తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో రిలీజైంది. హిందీలో 10 శాతం కంటే తక్కువగా, తెలుగులో 15 శాతం, మలయాళంలో 8 శాతం అక్యుపెన్సీ నమోదు చేసింది. దాంతో ఈ సినిమా తొలి రోజు పేలవంగా వసూళ్ల యాత్రను మొదలుపెట్టింది.

యూఎస్‌లో ఎన్ని టికెట్లు అంటే?

యూఎస్‌లో ఎన్ని టికెట్లు అంటే?

జిన్నా మూవీకి దారుణమైన అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. ఓవర్సీస్‌లో పేలవమైన వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమాను 17 లొకేషన్లలో రిలీజ్ చేయగా.. మొత్తం 50 షోల ద్వారా తొలి రోజు 49 టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ సినిమా 493 డాలర్లను వసూలు చేసింది. భారతీయ కరెన్సీలో ఈ సినిమా 40 వేల రూపాయలు అమెరికాలో రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా

ప్రపంచవ్యాప్తంగా

జిన్నా సినిమా దేశవ్యాప్తంగా అత్యల్పంగా కలెక్షన్లను నమోదు చేసింది. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి ఇండియాలో తొలి రోజు 16 లక్షల రూపాయలను రాబట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 17 లక్షలు షేర్.. 40 లక్షల గ్రాస్ వసూళ్లను నమోదు చేసినట్టు సమాచారం. ప్రిన్స్, ఓరిదేవుడా, సర్దార్ సినిమాల నుంచి భారీ పోటీ ఉండటంతో జిన్నా భారీగా కలెక్షన్లు రాబట్టడంలో వెనుకబడి పోయిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

జిన్నా లాభాల్లోకి రావాలంటే?

జిన్నా లాభాల్లోకి రావాలంటే?

జిన్నా సినిమా ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కనీసం 4.5 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అంటే ఈ సినిమా డిజాస్టర్‌గా మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X