Ginna Day 2 Collections బాక్సాఫీస్ వద్ద జిన్నా విలవిల.. మంచు విష్ణు మూవీకి ఎంత నష్టమంటే?
మంచు విష్ణు, సన్నీలియోన్, పాయల్ రాజ్‌పుత్ నటించిన జిన్నా చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతంలో అటెంప్ట్ చ చేసిన జోనర్లను పక్కన పెట్టి కొత్త కంటెంట్‌తో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చామని చెప్పారు. అయితే సర్దార్, ప్రిన్స్, ఓరి దేవుడా లాంటి సినిమాలతో పోటీ పడుతూ దీపావళీ కానుకగా ఈ సినిమాను మంచు విష్ణు ప్రేక్షకులకు అందించారు. తొలి రోజు పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోయిన ఈ చిత్రం.. 2వ రోజు ఏ విధంగా కలెక్షన్లను, ఫలితాలను రాబట్టిందో ఓసారి లుక్కేద్దాం.

కలెక్షన్లుగా మలచడంలో విఫలం
జిన్నా చిత్రంలో సన్నీలియోన్ ఫెర్ఫార్మెన్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకండాఫ్‌లో దివి వద్య, సన్నిలియోన్ పాత్రలు సినిమాను ఎమోషనల్‌గా మార్చాయనే టాక్ సినీ విమర్శకుల్లో, సాధారణ ప్రేక్షకుల్లో వినిపించింది. అయితే ఆ సినిమాకు ఉన్న పాజిటివ్‌ను కలెక్షన్ల రూపంలోకి మార్చుకోలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. దాంతో ఈ సినిమా కలెక్షన్లు పేలవంగా మారాయి,

జిన్నా ప్రీ రిలీజ్ బిజినెస్
జిన్నా సినిమా బిజినెస్ ఆశాజనకంగా సాగలేదు. భారీ రేంజ్‌లో రైట్స్ కోట్ చేయడంతో డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ముఖం చాటేశారు. దాంతో ఈ సినిమా తక్కువ రేంజ్‌లో ముగించారు. ఆంధ్రా, తెలంగాణలో ఓవరాల్‌గా 4 కోట్ల మేర బిజినెస్ జరిగింది. కర్ణాటకలో 25 లక్షల మేర ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ నమోదైంది.

తొలి రోజున ప్రపంచవ్యాప్తంా
జిన్నా చిత్రం తొలి రోజున దారుణమైన వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో 18 లక్ష్లల షేర్, హిందీలో 19 వేలు, మలయాళంలో 1 వెయ్యి రూపాయలు రాబట్టింది. సుమారుగా ఈ సినిమా తొలి రోజున 20 లక్షల వద్ద వసూళ్లను ముగించింది. ఇటీవల కాలంలో మీడియం రేంజ్ హీరో సినిమా సాధించిన అత్యల్ప వసూళ్లు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

రెండో రోజున తెలుగు రాష్ట్రాల్లో
ఇక రెండో రోజు విషయానికి వస్తే.. నైజాంలో చాలా చోట్ల ప్రేక్షకుల లేక జిన్నా సినిమా బాక్సాఫీస్ వద్ద విలవిలలాడింది. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్ లాంటి ప్రదేశాల్లో దాదాపు సినిమాను ఎత్తివేసే పరిస్థితి కనిపించింది. ఏపీలో పలు ప్రదేశాల్లో సగటున 10 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

అమెరికాలో రికార్డు నష్టాల్లో
జిన్నా సినిమాకు సంబంధించిన అమెరికా వసూళ్లు మరీ దారుణంగా ఉన్నాయి. యూఎస్‌లో ప్రీమియర్, శుక్రవారం కలిపి ఈ సినిమా 791 అమెరికన్ డాలర్లు వసూలు చేసింది. ఇక శనివారం 14 లోకేషన్లలో 451 అమెరికన్ డాలర్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం గత రెండు రోజుల్లో 150 టిక్కెట్లు అమ్ముడుపోయాయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ చిత్రం 1.2K డాలర్ల క్లబ్‌లో చేరిందని సెటైర్లు, మీమ్స్ వేస్తున్నారు.

జిన్నా గత రెండు రోజుల్లో కలెక్షన్లు
ఇక జిన్నా చిత్రం రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. వసూళ్ల పర్వం మరింత నిరాశజనకంగా సాగింది. దేశవ్యాప్తంగా 15 శాతం ఆక్యుపెన్సీ కూడా కనిపించలేదు. దాంతో ఈ చిత్రం దేశవ్యాప్తంగా 15 లక్షల వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం గత రెండు రోజుల్లో 35 లక్షల షేర్ రాబట్టింది.

జిన్నాకు ఎంత మేరకు నష్టమంటే?
దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ రిపోర్ట్ చూస్తే.. జిన్నా దారుణమైన వసూళ్లను నమోదు చేస్తున్నది. తొలివారాంతంలో కోలుకొనే పరిస్థితి కూడా కనిపించలేదు. దాంతో ఈ సినిమా రికార్డు నష్టాలతో ముగిసే అవకాశం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ సినిమా కనీసం 3.5 కోట్ల నష్టాన్ని నమోదు చేసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











