twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'గుండెజారి గల్లంతయ్యిందే' శాటిలైట్ రైట్స్ ఎంతకంటే

    By Srikanya
    |

    హైదరాబాద్ : విజయ్‌కుమార్ కొండా దర్శకత్వంలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితారెడ్డి నిర్మించిన 'గుండెజారి గల్లంతయ్యిందే' చిత్రం శుక్రవారం విడుదలై అన్ని చోట్లా ప్రజాదరణ పొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో చిత్రం శాటిలైట్ రైట్స్ 3.20 కోట్లకు అమ్ముడై రికార్డు క్రియేట్ చేసింది. నితిన్ చిత్రాల్లో ఈ రేటు రావటం రికార్డే అంటున్నారు. ఈ చిత్రం రైట్స్ ని జెమినీ వారు సొంతం చేసుకున్నారు.

    హీరో నితిన్ మాట్లాడుతూ... ఈ సినిమా విజయం ఘనత తన తండ్రి సుధాకర్‌రెడ్డిదేననీ, అప్పుడు 'ఇష్క్'కీ, ఇప్పుడు ఈ సినిమాకీ ఆయన పడ్డ కష్టం తనకు తెలుసుననీ, అందుకే ఈ సినిమా విజయాన్ని ఆయనకే అంకితమిస్తున్నాననీ ఆయన అన్నారు. ఇష్క్ తర్వాత వచ్చిన ఈ హిట్ ని నితిన్ బాగా ఎంజాయ్ చేస్తున్నానని,ఆచి తూచి తన కెరీర్ లో అడుగులు వేస్తున్నానని అన్నారు.

    "పవన్‌కల్యాణ్ 'తొలిప్రేమ'లోని 'ఏమైందో ఏమో ఈవేళ' పాట రీమిక్స్‌కి థియేటర్లు అదిరిపోతున్నాయి. అనూప్ రూబెన్స్ మరోసారి చక్కని మ్యూజిక్ ఇచ్చాడు. హర్షవర్థన్ అందించిన స్క్రీన్‌ప్లే సూపర్బ్'' అని ఆయన చెప్పారు. అన్ని తరగతుల వారూ తమ చిత్రాన్ని ఆదరిసూ హిట్ చేశారనీ, నితిన్, నిత్యాల అభినయం అద్భుతమనీ దర్శకుడు విజయ్‌కుమార్ అన్నారు.

    English summary
    
 The satellite rights of young hero Nithiin’s ‘Gunde Jaari Gallanthayyindhe’ fetched a superb price of approximately Rs. 3.20 Crores. This is the highest price in Nithiin’s career. The film’s rights were bagged by Gemini TV. The film is doing very well across the state and early estimates indicate a closing revenue share in excess of Rs. 20 Crores. GJG has been directed by Vijay Kumar Konda and Sresht Movies banner is the producer.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X