Gladiator II Collections: 3 రోజుల్లో 7600 కోట్లు.. కుమ్మేస్తున్న గ్లాడియేటర్ 2.. ఇండియాలో ఎన్ని కోట్లంటే?
హాలీవుడ్‌లో 24 ఏళ్ల క్రితం ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం విభాగంలో విజేతగా నిలిచిన గ్లాడియేటర్ సినిమాకు సీక్వెల్‌గా రూపొందిన గ్లాడియేటర్ చిత్రం గ్రాండ్‌గా వరల్డ్ వైడ్‌గా నవంబర్ 15వ తేదీన రిలీజైంది. రిడ్లీ స్కాట్ దర్శకత్వం వహించిన రోమ్ సామ్రాజ్యంలో జరిగిన కుట్రలు, కుతంత్రాల నేపథ్యంగా తెరకెక్కిన ఈ చిత్రంలో పాల్ మెస్కల్, పెడ్రో పాస్కల్, ఫ్రెడ్ హెచింగర్, లైయర్ రాజ్, డెరిక్ జాకోబి, డెంజెల్ వాషింగ్టన్ తదితరులు నటించారు. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్ల అంచనా, బడ్జెట్ వివరాల్లోకి వెళితే..
రోమ్ సామ్రాజ్యం పీఠం కోసం జరిగే అధిపత్యం, అలాగే పొరుగుదేశాల సైనికులను బందీలుగా చేసుకొన్న కథతో తెరకెక్కిన ఈ సినిమాను అద్బుతమైసెట్స్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో భారీగా రూపొందించారు. ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషన్ ఖర్చులు కలిపి 870 కోట్ల రూపాయలతో తెరకెక్కించారు. ఈ సినిమాను పారమౌంట్ సంస్థ విడుదల చేసింది.

గ్లాడియేటర్ 2 సినిమాకు టోక్యో, కొపెన్ హగన్, వాషింగ్టన్ తదితర ప్రాంతాల్లో ప్రదర్శించిన ప్రీమియర్‌కు అనూహ్యమైన స్పందన లభించింది. దాంతో ఈ రికార్డు స్థాయిలో వరల్డ్ వైడ్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను సుమారుగా 63 దేశాల్లో రిలీజ్ చేయగా భారీ స్పందన నమోదు అవుతున్నది. ఈ సినిమాను నవంబర్ 22 తేదీన రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ సినిమా తొలి రోజు రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ నమోదు అవుతున్నాయి.
ఇదిలా ఉండగా, ఇండియాలో గ్లాడియేటర్ సినిమాకు హాలీడేస్ కలిసి వచ్చాయి. శుక్రవారం గురునానక్ జయంతి కావడంతో తొలి రోజు భారీగా కలెక్షన్లు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తున్నది. ఈ సినిమాకు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్‌కు సానుకూలమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో మెరుగైన ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే గ్లాడియేటర్ సినిమాకు బెటర్ కలెక్షన్లు నమోదు అయ్యాయయని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమాకు తొలి రోజు సుమారుగా 3 కోట్ల రూపాయలు రాబడుతుందని అంచనా వేశారు. ఈవెనింగ్ షోకు రెస్సాన్స్ బాగా ఉంటే ఆ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ సినిమాకు దేశవ్యాప్తంగా 35 నుంచి 40 శాతం అక్యుపెన్సీ నమోదైంది.
ఇదిలా ఉండగా, గ్లాడియేటర్ చిత్రం ఓవర్సీస్‌లో గ్రాండ్‌గా ఓపెన్ అయంది. తొలి వారాంతం వరకు ఈ సినిమా నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద 35 మిలియన్ డాలర్లు, అలాగే ఓవర్సీస్ మార్కెట్ వద్ద 65 మిలియన్ డాలర్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. అంటే భారతీయ కరెన్సీలో 7600 కోట్ల రూపాయలు వసూలు చేస్తుందని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











