Godari Gattupaina Closing Collecions: గోదారిగట్టుపైన క్లోజింగ్ కలెక్షన్లు.. సుమంత్ ప్రభాస్ మూవీకి లాభమా?నష్టమా

యువ హీరో సుమంత్ ప్రభాస్, హీరోయిన్ నిధి ప్రదీప్ జంటగా నటించిన చిత్రం గోదారి గట్టుపైన. విలక్షణ నటుడు జగపతి బాబు, రాజీవ్ కనకాల, సీనియర్ హీరోయిన్ లైలా కీలక పాత్రల్లో నటించారు. ఇంకా దేవీ ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించారు. ఈ మూవీకి అభినవ్ రావు నిర్మాతగా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా మధూళిక సంచన లంక వ్యవహరించారు.

ఈ సినిమా సాంకేతిక విభాగాల వివరాల్లోకి వెళితే.. సినిమాటోగ్రఫి: సాయి సంతోష్, ఎడిటర్: అనిల్ కుమార్ పీ, మ్యజిక్: నాగ వంశీకృష్ణ, సౌండ్ ఇంజినీర్: నాగార్జున తాళ్లపల్లి, ప్రొడక్షన్ డిజైనర్: ప్రయల్య డీ తమ బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సినిమా మే 8వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే..

Godari Gattupaina Box Office Closing Collections

గోదారి గట్టుపైన చిత్రం మంచి స్టార్ కాస్ట్‌తో, టెక్నికల్‌ టీమ్‌తో తెరకెక్కించారు. అయితే ఈ సినిమా షూటింగులో జరిగిన జాప్యం కారణంగా బడ్జెట్ విషయంలో ముందస్తు వేసుకొన్న ప్లాన్ కంటే ఎక్కువగానే అయింది. ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి ఈ మూవీని సుమారుగా 10 కోట్ల రూపాయల బడ్జెట్‌తో రూపొందించారు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ భారీగా, వినూత్నంగా చేపట్టడం ద్వారా ఆడియెన్స్ అటెన్షన్ గ్రాబ్ చేసింది. ఈ సినిమాపై అంచనాలు పెరగడంతో బిజినెస్ కూడా భారీగానే వాల్యూ చేసింది. ఈ సినిమా బిజినెస్ విషయానికి వస్తే.. ఆంధ్రా, తెలంగాణలో కలిపి 4 కోట్ల రూపాయలు, కర్ణాటక, తమిళనాడు, ఇతర ప్రాంతాల్లో థియేట్రికల్ రైట్స్ 1 కోటి రూపాయలు, ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ 50 లక్షలు మేర వాల్యూ కట్టారు. మొత్తంగా ఈ సినిమా బిజినెస్ 5.5 కోట్ల మేర క్లోజ్ అయింది అని ట్రేడ్ పండితులు తెలిపారు.

ఈ సినిమాపై బజ్ పాజిటివ్‌గా ఉండటంతో సుమంత్ ప్రభాస్‌ గత సినిమా బేస్ చేసుకొని ఈ చిత్రాన్ని ఆంధ్రా, నైజాంలో కలిపి 800 స్క్రీన్లలో రిలీజ్ చేశారు. ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి ఈ సినిమాను సుమారుగా 1750 స్క్రీన్లలో ప్రదర్శించారు అనే ట్రేడ్ వర్గాల సమాచారం. అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత పూర్తిగా పాజిటి్వ్ టాక్‌ను సంపాదించుకోలేకపోయింది. మిక్స్‌డ్ టాక్ కారణంగా బాక్సాఫీస్ కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

గోదారి గట్టుపైన సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే.. ఈ చిత్రం తొలి రోజు 70 లక్షలు, రెండో రోజు 85 లక్షలు, మూడో రోజు 90 లక్ష్లలు, నాలుగో రోజు 55 లక్షలు, ఐదో రోజు 55 లక్షలు, ఆరో రోజు 50 లక్షలు, 7వ రోజు 40 లక్షలు, 8వ రోజు 30 లక్షలు, తొమ్మిదో రోజు 55 లక్షల రూపాయలు, 10వ రోజు 60 లక్షలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు, కర్ణాటక రాష్ట్రాలు కలుపుకొని 6 కోట్ల నెట్ కలెక్షన్లను సాధించింది అని సాక్ నిక్ వెల్లడించింది.

అయితే ఈ సినిమా ఇప్పటి వరకు 8 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 11 కోట్ల గ్రాస్ వసూళ్లను, 6 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమా దాదాపు థియేట్రికల్ రన్ దగ్గరపడింది. రానున్న రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? లేదా అనేది వేచి చూడాల్సిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X