Godari Gattupaina Day 1 collections: గోదారి గట్టుపైన తొలిరోజు కలెక్షన్స్.. సుమంత్ ప్రభాస్ మూవీ పరిస్థితేంటి?

Godari Gattupaina collections: సుమంత్ ప్రభాస్ 'మేము ఫేమస్' సినిమాతో యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకొని బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మరోసారి కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోదారి గట్టుపైన పేరుతో తెరకెక్కిన ఈ చిత్రంలో సుమంత్ ప్రభాస్‌కు జోడీగా నిధి ప్రదీప్ నటించగా, జగపతిబాబు కీలక పాత్ర పోషించారు. దర్శకుడు సుభాష్ చంద్ర తెరకెక్కించిన ఈ పల్లెటూరి ప్రేమకథ గోదావరి జిల్లాల నేపథ్యంలో సాగుతుంది. సమ్మర్ కానుకగా మే 8న ఈ మూవీ వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. ఈ నేపథ్యంలో గోదారి గట్టుపైన మూవీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ఈవెన్ టార్గెట్ ఎంత? తొలిరోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది? ఈ వివరాల్లోకి వెళితే..

'గోదారి గట్టుపైన' సినిమాలో సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ హీరో హీరోయిన్లుగా నటించగా, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవీ ప్రసాద్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సుభాష్ చంద్ర దర్శకత్వం వహించగా, అభినవ్ రావు నిర్మాతగా వ్యవహరించారు. మధూళిక సంచన లంక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. సినిమాటోగ్రఫీని సాయి సంతోష్ అందించగా, ఎడిటింగ్ బాధ్యతలను అనిల్ కుమార్ పీ చేశారు. నాగ వంశీకృష్ణ సంగీతం సమకూర్చగా, నాగార్జున తాళ్లపల్లి సౌండ్ ఇంజినీర్‌గా పనిచేశారు. ప్రొడక్షన్ డిజైన్‌ను ప్రయల్య డీ రూపొందించారు.

Godari Gattupaina day 1 expected box office collections worldwide Sumanth Prabhas Love Drama Opening Collections

సినిమా కథ విషయానికి వస్తే..గోదావరి జిల్లాలో ఆటో డ్రైవర్‌గా జీవించే రాజు (సుమంత్ ప్రభాస్) చుట్టూ తిరుగుతుంది. స్నేహితులతో సరదాగా గడిపే అతడు ఇంజినీరింగ్ స్టూడెంట్ మాయ ( నిధీ ప్రదీప్)ను ప్రేమిస్తాడు. కానీ మాయ తండ్రి శ్యాంబాబు ( జగపతి బాబు) వారి ప్రేమకు అడ్డుగా నిలవడంతో కథలో ఎమోషనల్ డ్రామా మొదలవుతుంది. ప్రేమలో ఉండగానే రాజుకు మాయ దూరంగా ఉండాలని మాయ ఎందుకు నిర్ణయం తీసుకొన్నది? రాజు, మాయ ప్రేమపై శ్యాంబాబుకు ఉన్న అభ్యంతరాలు ఏమిటి? మాయతో ప్రేమను గెలుచుకోవడానికి శ్యాంబాబుతో రాజు చేసిన ప్రయత్నాలు ఏమిటి? రాజును అల్లుడిగా చేసుకోవడానికి శ్యాంబాబు ఒప్పుకొన్నాడా? ఈ ప్రేమ వ్యవహారంలో రాజు, మాయ ఫ్యామిలీ మధ్య జరిగిన డ్రామా ఏంటి? చివరకు రాజు, మాయ ప్రేమ పెళ్లిగా మారిందా? అనే ప్రశ్నలకు సమాధానమే గోదారి గట్టుపైన సినిమా.

బిజినెస్ అండ్ బ్రేక్ఈవెన్ టార్గెట్
నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రొడక్షన్ కాస్ట్, పబ్లిసిటీ ఖర్చులు కలిపి రేజర్ మూవీకి 10 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లుగా ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. చిన్న సినిమా అయినప్పటికీ అత్యున్న నిర్మాణ విలువలు, సినిమాటిక్ అనుభూతి కోసం నిర్మాతలు బాగానే ఖర్చు చేశారు. గోదారిగట్టు సినిమా లాభాల్లోకి రావాలంటే రూ. 10 కోట్ల రూపాయల షేర్, 17 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు నిర్దేశించారు.

విడుదలకు ముందే ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా ట్రైలర్ విడుదల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఆసక్తి పెరిగింది. బుక్‌మైషో సమాచారం ప్రకారం.. మే 8 ఉదయం నాటికి హైదరాబాద్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో కలిపి 45 వేల మందికి పైగా ఈ సినిమాపై ఆసక్తి చూపించినట్లు తెలుస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా మంచి స్పందనను అందుకున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

సినిమా ఓపెనింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే.. తొలి రోజు బాక్సాఫీస్ వద్ద సుమారు రూ.1.2 కోట్ల నుంచి 1.4 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశముందని ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి. నెట్ కలెక్షన్లు దాదాపు రూ.80 నుంచి కోటి వరకు ఉండొచ్చని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలి రోజు సుమారు రూ.1.50 కోట్ల గ్రాస్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోందని సమాచారం. ఓవర్సీస్ మార్కెట్‌లో కూడా ఈ సినిమాకు కొంతమేర ఆదరణ కనిపిస్తోంది. మిడ్ బడ్జెట్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ సంపాదించుకుంది. మరి రానున్న రోజుల్లో మౌత్ టాక్ మారితే.. మంచి వసూళ్లు సాధించే అవకాశముందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X