అంత సీన్ లేదు!!!
ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రూపొందించిన ఎ కోదండరామిరెడ్డి తన కుమారుడు వైభవ్ ను హీరోగా పరిచయం చేస్తూ తీసిన సినిమా గొడవ తొలివారం కలెక్షన్లు సంతృప్తికరంగా ఉన్నాయని తెలుస్తోంది. సినిమా విడుదలైన తొలి మూడు రోజులు థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించడమే ఇందుకు నిదర్శనమని విశ్లేషకులు చెబుతున్నారు. ఊహించని రీతిలో ఓపెనింగ్స్ ఉండడం కోదండరామిరెడ్డినే ఆశ్చర్యానికి గురిచేస్తోందట. సినిమాలో పస లేకున్నా ఇలాంటి ఓపెనింగ్స్ ఉండడం బహుషా ఆయన చేతి చలవ కావచ్చేమో మరి. రెండో వారంలో వసూళ్లే ఈ సినిమా భవిత్యాన్ని నిర్ణయించనున్నాయి. ఈ సినిమాతో పాటే విడుదలైన శివాజీ స్టేట్ రౌడీ సినిమాకు అంత సీన్ లేదని తెలిసిపోయింది. ఈ సినిమా విడుదలైవ థియేటర్లకు అద్దె చెల్లించడానికే వసూళ్లు సరిపోవడంలేదని తెలిసిపోయింది. మిగతా సినిమాల గురించి చెప్పకోవడం కన్నా హ్యాపీడేస్ కు ఇంకా ఎదురులేదని చెప్పుకుంటే సరిపోతుంది. తెలుగు సినిమాల విషయాన్ని పక్కన పెడితే షారూక్ ఖాన్, దీపికా పడుకొనే సినిమా ఓం శాంతి ఓం సినిమా క్లైమాక్స్ బలంతో భారీ కలెక్షన్లతో మాయ చేస్తోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











