GodFather Closing Collections గాడ్ ఫాదర్‌ హిట్టా? ఫట్టా? చిరంజీవి మూవీ క్లోజింగ్ కలెక్షన్లు ఎంతంటే?

మలయాళంలో అప్పటికే విజయవంతమై.. ఓటీటీలో అత్యధికంగా ప్రేక్షకులు వీక్షించిన లూసిఫర్‌ చిత్రానికి రీమేక్‌గా వచ్చిన గాడ్ ఫాదర్ మూవీ బాక్సాఫీస్ జర్నీ దాదాపు ముగిసింది. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ రాజా కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొన్నది. అయితే తొలివారాంతం తర్వాత గాడ్ ఫాదర్ సినిమా కలెక్షన్ల జోరును కొనసాగించలేకపోయింది. దాంతో ఈ సినిమా వసూళ్ల పరంగా వెనుక పడింది. ఈ సినిమా గత 20 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ వ్యాల్యూ ఎంతంటే?

ప్రీ రిలీజ్ వ్యాల్యూ ఎంతంటే?

గాడ్‌ఫాదర్ సినిమాను నిర్మాత ఎన్వీ ప్రసాద్ స్వయంగా రిలీజ్ చేశారు. ఈ సినిమాను బాక్సాఫీస్ వద్ద 73 కోట్లుగా వ్యాల్యూ కట్టారు. ఏపీ, తెలంగాణలో 54 కోట్లుగా, కర్ణాటకలో 6 కోట్లు, హిందీ, ఇతర ప్రాంతాల్లో 5.5 కోట్లుగా, ఓవర్సీస్‌లో 7.5 కోట్లుగా వ్యాల్యూ కట్టారు. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ లక్ష్యం 74 కోట్లుగా నిర్దేశించారు.

నైజాం, సీడెడ్‌లో వసూళ్లు ఎంతంటే?

నైజాం, సీడెడ్‌లో వసూళ్లు ఎంతంటే?

ఇక గాడ్‌ఫాదర్ చిత్రం నైజాంలో తొలి మూడు రోజుల్లో భారీగానే కలెక్షన్లను రాబట్టింది. ఈ చిత్రం నైజాంలో 12.34 కోట్లు వసూలు చేసింది. ఇక సీడెడ్‌లో 9.61 కోట్లు రాబట్టింది. ఈ రెండు ప్రాంతాల్లో కనీసం ఈ సినిమా వ్యాల్యూ 29 కోట్లుగా నిర్ణయించారు. ఈ రెండు ప్రాంతాల్లో 22 కోట్లు మాత్రమే వసూలు చేసింది.

ఆంధ్రాలో బాక్సాఫీస్ రిపోర్టు ఇలా..

ఆంధ్రాలో బాక్సాఫీస్ రిపోర్టు ఇలా..


ఇక గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించిన బిజినెస్‌ను 25 కోట్లుగా వ్యాల్యూ కట్టారు. అయితే ఈ చిత్రం ఉత్తరాంధ్రలో 6 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2.44 కోట్లు, గుంటూరులో 4.07 కోట్లు, కృష్ణా జిల్లాలో 2.94 కోట్లు, నెల్లూరులో 2.13 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం 22 కోట్ల షేర్, 71.5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో తక్కువలో తక్కువ 5 కోట్లు డిఫిసిట్ చూపిస్తున్నది.

కర్ణాటక, హిందీలో కలెక్షన్లు..

కర్ణాటక, హిందీలో కలెక్షన్లు..


ఇక కర్ణాటక, హిందీ విషయానికి వస్తే.. కర్ణాటకలో 4.72 కోట్లు, హిందీ, ఇతర రాష్ట్రాల్లో 5.2 కోట్లు వసూలు చేసింది. ఒక ఓవర్సీస్‌లో 5.19 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ సినిమా భారీగానే నష్టాలను నమోదు చేసింది. గాడ్‌ఫాదర్ ప్రేక్షకులను మెప్పించినా.. అన్ని వర్గాలను థియేటర్‌కు రప్పించలేదనే విషయాన్ని స్పష్టం చేసింది.

గాడ్ ఫాదర్‌కు ఎంత నష్టమంటే?

గాడ్ ఫాదర్‌కు ఎంత నష్టమంటే?


ప్రస్తుతం కన్నడ చిత్రం కంతార, తమిళ చిత్రం గాడ్‌ఫాదర్ సినిమా నుంచి వస్తున్న పోటీని గాడ్‌ఫాదర్ తట్టుకోలేకపోతున్నది. పలు చోట్ల కలెక్షన్లు, ఆక్యుపెన్సీ లేకపోవడంతో సినిమాను ఎత్తివేస్తున్నారు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ జర్నీ ముగిసినట్టే అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ సినిమా దాదాపు 15 కోట్లకుపైగా నష్టాలతో ముగిసే అవకాశం ఉంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X