GodFather day 3 Collections 100 కోట్లకు చేరువగా.. కలెక్షన్ల జోరు తగ్గని మెగాస్టార్.. మూడో రోజు ఎంతంటే?

దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన గాడ్‌ఫాదర్ చిత్రం తెలుగు, హిందీ అనే తేడా లేకుండా బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తున్నది. పరిమితమైన థియేటర్ కౌంట్‌తో రిలీజైన మెగాస్టార్ చిరంజీవి భారీగా వసూళ్లను కురిపిస్తున్నది. దేశవ్యాప్తంగా వర్కింగ్ డే రోజున కూడా తొలి రోజుక స్థాయిలో కలెక్షన్లను రాబడుతున్నది. ఈ సినిమా మూడో రోజు కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే?

2 రోజుల్లో ఆంధ్రా, నైజాంలో

2 రోజుల్లో ఆంధ్రా, నైజాంలో


గాడ్ ఫాదర్ చిత్రం గత 2 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా ఉన్నాయి. నైజాంలో ఈ చిత్రం 5.67 కోట్ల షేర్, సీడెడ్‌లో 5.14 కోట్ల షేర్, గుంటూరులో 2.35 కోట్ల షేర్, నెల్లూరులో 90 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.04 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 2.11 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.27 కోట్లతో మొత్తంగా 20.7 కోట్లు రాబట్టింది.

దేశవ్యాప్తంగా 2 రోజుల కలెక్షన్లు

దేశవ్యాప్తంగా 2 రోజుల కలెక్షన్లు


గాడ్‌ఫాదర్ చిత్రం దేశవ్యాప్తంగా గత 2 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలో ఈ చిత్రం 2.7 కోట్ల గ్రాస్, ఏపీ, నైజాంలో 32.28 కోట్ల గ్రాస్, కేరళలో 7 లక్షలు, రెస్టాఫ్ ఇండియాలో 2.65 కోట్ల గ్రాస్‌తో దేశవ్యాప్తంగా ఈ చిత్రం 37.7 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం గత రెండు రోజుల్లో హిందీ, తెలుగు వెర్షన్లతో కలిపి 37.5 కోట్లు వసూలు చేసింది.

3వ రోజు ఆక్యుపెన్సీ

3వ రోజు ఆక్యుపెన్సీ


ఇక గాడ్‌ఫాదర్ చిత్రం మూడో రోజున నైజాం, ఆంధ్రాలో భారీగానే ఆక్యుపెన్సీని నమోదు చేసుకొన్నది. ఆంధ్రా విషయానికి వస్తే.. రాజమండ్రిలో 70 శాతం, కాకినాడలో 90 శాతం, వైజాగ్‌లో 63 శాతం, గుంటూరులో 40 శాతం, విజయవాడలో 38 శాతం అక్యుపెన్సీ నమోదైంది. అలాగే నైజాం విషయానికి వస్తే హైదరాబాద్‌లో 35 శాతం, వరంగల్‌లో 45 శాతం, నిజామాబాద్‌లో 38 శఆతం, కరీంనగర్‌లో 30 శాతం, మహబూబ్ నగర్‌లో 39 శాతం అక్యుపెన్సీ నమోదైంది.

ప్రభావం చూపలేకపోతున్న హిందీ వెర్షన్

ప్రభావం చూపలేకపోతున్న హిందీ వెర్షన్


గాడ్‌ఫాదర్ సినిమా హిందీ వెర్షన్ విషయానికి వస్తే. పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం ఆక్యుపెన్సీ 10 శాతానికి మించి నమోదు కావడం లేదు. హైదరాబాద్, బెంగళూరు, జైపూర్ లాంటి నగరాల్లో ఓ మోస్తారు వసూళ్లు నమోదయ్యాయి.

మూడో రోజు దేశవ్యాప్తంగా

మూడో రోజు దేశవ్యాప్తంగా


ఇక మూడో రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. గాడ్‌ఫాదర్ చిత్రం దేశవ్యాప్తంగా 8.5 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 5.5 కోట్ల నుంచి 6 కోట్ల షేర్ సాధించడానికి ఛాన్స్ ఉంది. హిందీ 70 లక్షల నుంచి 1 కోటి రూపాయలు వసూలు చేయవచ్చు అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అమెరికాలో తాజా సమాచారం ప్రకారం.. 55k డాలర్లు నమోదు చేసింది.

 గాడ్‌ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు

గాడ్‌ఫాదర్ ప్రపంచవ్యాప్తంగా మూడో రోజు


గత రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 69.12 కోట్లు రాబట్టిన ఈ చిత్రం మూడో రోజున 20 నుంచి 25 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేయవచ్చు. దాంతో ఈ చిత్రం మూడు రోజల్లో సుమారు 90 కోట్ల గ్రాస్ వద్ద నిలిచే అవకాశం ఉంది. శనివారం నాటికి ఈ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశ ఉంది. అదే ఊపు కొనసాగితే.. ఆదివారం 150 కోట్లకు చేరువయ్యే ఛాన్సులు కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X