GodFather Day 4 Collections బాక్సాఫీస్ వద్ద చిరంజీవి జైత్రయాత్ర.. 4వ రోజు కూడా దండయాత్రే!

మెగాస్టార్ నటించిన గాడ్‌ఫాదర్ చిత్రం బాక్సాఫీస్ జైత్రయాత్ర దిగ్విజయంగా ముందుకు సాగుతున్నది. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం లాంగ్ వీకెండ్‌ను సద్వినియోగం చేసుకొంటున్నది. ఈ సినిమాతోపాటు రిలీజైన చిత్రాలు పెద్దగా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోకపోవడంతో గాడ్‌ఫాదర్ సినిమాకు బాగా కలిసి వస్తున్నది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో గాడ్‌ఫాదర్ చిత్రం 4వ రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

గాడ్‌ఫాదర్ తొలి రెండు రోజుల్లో

గాడ్‌ఫాదర్ తొలి రెండు రోజుల్లో


గాడ్‌ఫాదర్ చిత్రం దేశవ్యాప్తంగా తొలి రోజున 20.2 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ కలెక్షన్లతో కలిపి 38 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 19.15 కోట్లు, హిందీలో 1.05 కోట్లు సాధించింది. ఇక రెండో రోజున ఈ చిత్రం దేశవ్యాప్తంగా 11.95 కోట్ల షేర్ సాధించింది. ఓవర్సీస్ కలెక్షన్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 31 కోట్లు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో 11.25 కోట్లు, హిందీలో 70 లక్షలు వసూలు చేసింది.

మూడో రోజు కూడా అదే జోష్

మూడో రోజు కూడా అదే జోష్


ఇక గాడ్‌ఫాదర్ చిత్రం మూడో రోజు అదే జోష్‌ను కొనసాగించింది. తెలుగు రాష్ట్రాల్లో 8.65 కోట్ల షేర్, హిందీలో 72 లక్షల షేర్‌తో యూఎస్‌లో 3.10 వసూళ్లతో కలిపి ప్రపంచవ్యాప్తంగా 34.36 షేర్, 69 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసింది.

4వ రోజు ఆక్యుపెన్సీ ఇలా..

4వ రోజు ఆక్యుపెన్సీ ఇలా..

ఇక తెలుగు రాష్ట్రాల్లో గాడ్‌ఫాదర్ చిత్రం 4వ రోజు అక్యుపెన్సీకి వస్తే.. ఆంధ్రాలో విజయవాడలో 48 శాతం అక్యుపెన్సీ, గుంటూరులో 47 శాతం, వైజాగ్‌లో 67 శాతం, కాకినాడలో 87 శాతం, రాజమండ్రిలో 76 శాతం ఆక్యుపెన్సీ నమోదు చేసింది. తెలంగాణలో మహబూబ్ నగర్‌లో 37 శాతం, కరీంనగర్‌లో 39 శాతం, నిజమాబాద్‌లో 55 శాతం, వరంగల్‌లో 52.5 శాతం, హైదరాబాద్‌లో 53 శాతం అక్యుపెన్సీ నమోదు చేసింది.

హిందీ వెర్షన్‌కు నిరాశే..

హిందీ వెర్షన్‌కు నిరాశే..


గాడ్‌ఫాదర్ హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో పెద్దగా ఆక్యుపెన్సీ కనిపించలేదు. ముంబై, పూణే, బెంగళూరు, కోల్‌కతా, జైపూర్, లక్నో తదితర నగరాల్లో 15 శాతానికి లోపే ఆక్యుపెన్సీ నమోదైంది. వర్కింగ్ డే ప్రభావం ఈ సినిమాపై స్పష్టంగా కనిపించింది.

గాడ్‌ఫాదర్ 4వ రోజు అంచనా

గాడ్‌ఫాదర్ 4వ రోజు అంచనా


ఇదిలా ఉండగా.. గాడ్‌ఫాదర్ మూవీ 4వ రోజు కలెక్షన్ల అంచనా విషయానికి వస్తే.. దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఈ చిత్రం 11 కోట్ల షేర్ వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనావేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో 6.5 కోట్లు, హిందీలో 1 కోటి షేర్, ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియాతో కలిపి మొత్తం 12 నుంచి 15 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉంది.

గాడ్‌ఫాదర్ లాభాల్లోకి వస్తుందా?

గాడ్‌ఫాదర్ లాభాల్లోకి వస్తుందా?


గాడ్‌ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే.. 91 కోట్ల బ్రేక్ ఈవెన్ లక్ష్యంతో బాక్సాఫీస్ జర్నీ మొదలైంది. ఇప్పటి వరకు ఈ సినిమా 35 కోట్ల షేర్ సాధించింది. 4వ రోజు 12 కోట్ల షేర్ సాధించే అవకాశాలు ఉన్నాయి. దాంతో 47 కోట్ల వరకు రాబట్టే అవకాశం ఉంది. తొలి వారం ముగింపు వరకు బ్రేక్ ఈవెన్‌కు చేరువయ్యే ఛాన్స్ కనిపిస్తున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X