GodFather day 6 Collections గాడ్‌ఫాదర్ అరుదైన రికార్డు.. 100 కోట్ల క్లబ్‌లో మరోసారి చిరంజీవి
దసరా పండుగ కానుకగా భారీ అంచనాలతో బాక్సాఫీస్ బరిలోకి దిగిన గాడ్‌ఫాదర్ చిత్రం వసూళ్ల ప్రయాణాన్ని నిలకడగా కొనసాగిస్తున్నది. మలయాళ చిత్రం లూసిఫర్‌కు రీమేక్‌గా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ చిత్రం తొలి ఆట నుంచి పాజిటివ్ టాక్‌తో కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నది. ఇప్పటికే 100 కోట్ల గ్రాస్ వసూళ్లకు ఈ చిత్రం చేరువైంది. ఈ సినిమా 6వ రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..

5 రోజుల్లో వసూళ్లు
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద గాడ్‌ఫాదర్ సినిమా గత ఐదు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలి రోజు 20.3 కోట్ల షేర్, రెండో రోజు 12.05 కోట్లు, మూడో రోజు 8.83 కోట్ల షేర్, 4వ రోజు 9.7 కోట్ల షేర్, 5వ రోజు 9.4 కోట్ల షేర్ సాధించింది. దేశవ్యాప్తంగా ఈ చిత్రం గత ఐదు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 54.68 కోట్లు, హిందీలో 6.56 కోట్లతో మొత్తం 60.28 కోట్లు వసూలు చేసింది.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో
గాడ్ ఫాదర్ చిత్రం రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. 5 రోజుల్లో కర్ణాటకలో 4.45 కోట్లు, తెలుగురాష్ట్రాల్లో 54.68 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో 7.76 కోట్లతో కలిపి 70 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక ఓవర్సీస్ కలెక్షన్లు 10 కోట్ల గ్రాస్ వసూళ్లతో మొత్తం 80 కోట్లకుపైగా కలెక్షన్లను నమోదు చేసింది.

హిందీలో కలెక్షన్లు
సల్మాన్ ఖాన్, చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ చిత్రం హిందీలో తొలి రోజున 1.61 కోట్లు, గురువారం 87 లక్షలు, శుక్రవారం 96 లక్షలు, శనివారం 1.45 కోట్లు, ఆదివారం 3.47 కోట్లతో మొత్తం 9 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది.

6వ రోజున ఆక్యుపెన్సీ ఇలా
ఇక 6వ రోజున గాడ్‌ఫాదర్ అక్యుపెన్సీ నిలకడగా కనిపించింది. ఆంధ్రాలో విజయవాడలో 10 శాతం, గుంటూరులో 25 శాతం, వైజాగ్‌లో 23 శాతం, కాకినాడలో 50 శాతం, రాజమండ్రి 29 శాతం అక్యుపెన్సీ నమోదైంది. ఇక నైజాంలో మహబూబ్ నగర్‌లో 20 శాతం, కరీంనగర్‌లో 18 శాతం, నిజమాబాద్‌లో 11 శాతం, వరంగల్‌లో 23 శాతం, హైదరాబాద్‌లో 18 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.
100 కోట్ల పోస్టర్‌తో మోహన్ రాజా
గాడ్‌ఫాదర్ సినిమా 6వ రోజు వసూళ్ల విషయానికి వస్తే.. నిలకడగా కలెక్షన్లను సాధించినట్టు సమాచారం. అన్ని సినిమాలకు అగ్నిపరీక్షగా మారే సోమవారం రోజున గాడ్ ఫాదర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4 కోట్ల షేర్.. 7 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దాంతో ఈ సినిమా 100 కోట్ల అరుదైన రికార్డును చేరుకొన్నది. మోహన్ రాజా ట్వీట్ చేస్తూ.. ఈ విషయాన్ని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











