Don't Miss!
- News కాంగ్రెస్ ఖమ్మం సీటు పంచాయితీలో అనూహ్య మలుపు..!!
- Technology జియో సినిమా యాప్‌లో IPL మ్యాచ్‌లను ఉచితంగా చూస్తున్నారా.. రేపు కీలక ప్రకటన??
- Sports ఆ రూల్ వల్లే గెలిచాం- KL రాహుల్
- Automobiles క్రాష్ టెస్ట్‌లో హోండా అమేజ్‌కు గట్టి షాక్.. ఆ విభాగంలో ‘0' రేటింగ్.!!
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
Godzilla vs Kong 2 day collections: ఉత్తరాదిలో డీలా.. దక్షిణాదిలో పరిస్థితి ఏంటంటే!
హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బలంగా ప్రభావం చూపలేకపోయినప్పటికీ.. ఓ మోస్తారు కలెక్షన్లను సాధిస్తున్నది. ఇంటర్నేషనల్ రిలీజ్ కంటే రెండు రోజుల ముందే భారత్‌లో విడుదలైన ఈ చిత్రం లాక్డౌన్ తర్వాత ఉత్తరాది ప్రాంతాల్లో, దక్షిణాదిలో మెరుగైన వసూళ్లనే రాబట్టింది. గత రెండు రోజుల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే...
ఘనంగా హీరోయిన్ హన్సిక సోదరుడి పెళ్లి (ఫొటోలు)
కరోనా లాక్‌డౌన్‌తో దారుణంగా దెబ్బ
మహరాష్ట్ర సహా ఉత్తర భారత దేశంలో కరోనావైరస్ విజృంభిస్తున్న కారణంగా సినిమాలపై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపడం లేదని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీకి ముంబై సహా పట్టణాల్లో అక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. హిందీ వెర్షన్‌కు తొలి రోజున 80 లక్షలు మాత్రమే రాబట్టడం దాని బాక్సాఫీస్ పరిస్థితికి అద్దం పట్టింది.
పడిపోయిన అక్యుపెన్సీ రేటు
గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ రెండో రోజు పరిస్థితి చూస్తే తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్యుపెన్సీ దారుణంగా పడిపోయింది. మ్యాట్నీ షో సమయంలో సగటున 35 శాతం అక్యుపెన్సీ నమోదు అవుతున్నది. వారాంతంలో పెరిగే అవకాశం లేకపోలేదనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
రెండు రోజుల్లో వసూళ్లు ఇలా...
గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ గత రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఇలా ఉన్నాయి. బుధవారం రోజున ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ.6.45 కోట్లు, గురువారం రూ.4.75 కోట్లు వసూలు చేసింది. దీంతో ఈ చిత్రం అన్ని భాషల్లో కలుపుకొని రూ.11.20 కోట్లు వసూలు చేసింది.
మూడో రోజు అంచనా ఎంతంటే
గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ఇక మూడో రోజు కలెక్షన్లను ట్రేడ్ వర్గాలు ఇలా అంచనా వేశాయి. శుక్రవారం ప్రాంతీయ సినిమాల రిలీజ్‌ను తట్టుకొని ఈ చిత్రం రూ.2.50 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రాంతీయ భాషల్లో విడుదలైన సినిమాల హిట్ రేంజ్‌ను బట్టి బాక్సాఫీస్ వద్ద గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమా భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.