Godzilla vs Kong 5 Days Collections: భారీ పెరిగిన వసూళ్లు.. వారాంతంలో మ్యాజిక్ ఫిగర్స్
గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రం దేశవ్యాప్తంగా వసూళ్ల తడాఖాను చూపిస్తున్నది. తొలి రోజు భారీ కలెక్షన్లను సాధించిన ఈ చిత్రం మధ్యలో రెండు రోజులు తడబాటుకు గురైంది. అయితే వారాంతంలో ఈ చిత్రం భారీ కలెక్షన్లను సాధించింది. ఈ చిత్రం తొలి రోజున 6.25 కోట్లు సాధించగా, ఆ తర్వాత రూ.5.25 కోట్లు, శుక్రవారం రూ.4.25 కోట్లు సాధించింది.
ఇక వారాంతంలో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రానికి మంచి స్పందన కనిపించింది. ఈ చిత్రం శనివారం రూ.6.25 కోట్లు, ఆదివారం రూ.6 కోట్లు వసూలు చేసింది. దాంతో ఈ సినిమా ఓవరాల్ కలెక్షన్లు రూ.28 కోట్లుగా నమోదయ్యాయి.
మాస్టర్ హీరోయిన్ బోల్డ్ ఫోటోషూట్.. మాళవిక ఎద అందాల ప్రదర్శన

గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రానికి ఉత్తరాదిలో అంతగా స్పందన లభించలేదు. పలు చోట్ల లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగడం, రాత్రి పూట కర్ఫ్యూ విధించడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.
గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రం కలెక్షన్ల గురించి ప్రముఖ ట్రేడ్ అనలిస్టు తరుణ్ ఆదర్శ్ ట్వీట్ చేస్తూ ఈ చిత్రం వారాంతంలో భారీగా కలెక్షన్లను సాధించింది. ఆదివారం కలెక్షన్లతో ఈ చిత్రం రూ.30 కోట్లకు చేరువైంది అని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











