Godzilla vs. Kong Collections: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా.. ఉత్తరాదిలో దారుణంగా ఒపెనింగ్స్.. తొలి రోజు ఎంతంటే!

హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ బాక్సాఫీస్ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది. లాక్‌డౌన్ తర్వాత హిందీ సినిమాల కంటే ధీటుగా తొలి రోజున వసూళ్లను నమోదు చేసింది. దేశవ్యాప్తంగా పలు భాషల్లో రిలీజైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ కనిపిస్తున్నది. ఇంటర్నేషనల్ రిలీజ్ కంటే రెండు రోజుల ముందుగానే భారత్‌లో ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

బాలీవుడ్ చిత్రాల కంటే మెరుగ్గా

బాలీవుడ్ చిత్రాల కంటే మెరుగ్గా


కరోనావైరస్ పరిస్థితుల కారణంగా బాక్సాఫీస్ వద్ద హిందీ చిత్రాలు అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి. ఇటీవల రిలీజైన జాన్వీ కపూర్ రూహీ, జాన్ అబ్రహం నటించిన ముంబై సాగా సినిమా కలెక్షన్లు పేలవంగా ఉన్నాయి. అయితే హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రానికి మాత్రం మంచి రెస్పాన్స్ లభించింది.

కసరత్తుల పేరుతో మలైకా అరోరా గ్లామర్ షో.. పొట్టి దుస్తుల్లో మరింత బోల్డ్‌గా

ఉత్తరాదిలో పేలవంగా వసూళ్లు

ఉత్తరాదిలో పేలవంగా వసూళ్లు

ఉత్తరాది రాష్ట్రాల్లో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రానికి పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. సగటు మొత్తంగా ఈ చిత్రానికి 15 శాతానికి మించి ఆక్యుపెన్సీ కనిపించలేదు. దాంతో ఉత్తరాది రాష్ట్రాల్లో పేలవంగా కలెక్షన్లు నమోదయ్యాయి. పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతుండటంతో సినిమా థియేటర్లు వెలవెలబోతున్నాయి.

తమిళనాడులో మోస్తారుగా

తమిళనాడులో మోస్తారుగా


ఇక తమిళనాడులో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రానికి మోస్తారు స్పందన కనిపిస్తున్నది. ఈ సినిమాకు సుమారు 35 శాతం ఆక్యుపెన్సీ థియేటర్లలో కనిపించింది. వర్కింగ్ డే రోజున కూడా ఈ రేంజ్ ఆక్యుపెన్సీ కనిపించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. దాంతో మంచి ఓపెనింగ్స్ నమోదయ్యాయి. వారాంతంలో ఇంకా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది.

నైజాం, ఆంధ్రాలో భారీగా

నైజాం, ఆంధ్రాలో భారీగా

తెలుగు రాష్ట్రాల్లో గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ మూవీకి భారీ ఓపెనింగ్స్ కనిపించాయి. ఇటీవల రిలీజైన తెలుగు సినిమాల కంటే ఎక్కువగా వసూళ్లు నమోదయ్యాయి. విశాఖపట్నం, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, వరంగల్, నిజమాబాద్ లాంటి పట్టణాల్లో మంచి రెస్సాన్స్ లభిస్తున్నది. తెలుగు వెర్షన్‌కు సంబంధించి భారీ కలెక్షన్లు నమోదయ్యే అవకాశం ఉంది.

Recommended Video

Godzilla vs Kong: అదరగొట్టిన Kong.. రిలీజ్ ఎప్పుడంటే? | Godzilla vs Kong Trailer | Filmibeat Telugu
తొలి రోజున రూ.4.5 కోట్లు!

తొలి రోజున రూ.4.5 కోట్లు!

ట్రేడ్ వర్గాల అంచనా ప్రకారం.. గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రానికి మంచి కలెక్షన్లు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ చిత్రం తొలి రోజున సుమారు రూ.4.5 కోట్లు వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లను బట్టి కలెక్షన్ల రేంజ్ పెరిగే అవకాశ: ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X