Godzilla vs. Kong Day 3 Collections: ఇండియాలో గర్జించిన గాడ్జిల్లా.. ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు

హాలీవుడ్ చిత్రం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ భారతీయ బాక్సాఫీస్ వద్ద నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. విదేశాల్లో కంటే రెండు రోజుల ముందుగానే భారత్‌లో రిలీజ్ అయిన ఈ చిత్రం తొలి రోజు మంచి కలెక్షన్లను రాబట్టింది. సెలవు దినాల్లో కూడా ఈ సినిమాకు మంచి స్పందన లభించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రం మూడో రోజున రూ.4.22 కోట్లు వసూలు చేసింది. అయితే ట్రేడ్ విశ్లేషకుల అంచనాల మించి శుక్రవారం వసూళ్లను నమోదు చేసింది. ఇక వారాంతంలో కూడా ఈ చిత్రం భారీ లాభాలను రాబట్టే అవకాశం ఉందనే మాటను ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

 Godzilla vs. Kong Day 3 Collections worldwide

గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ సినిమా కలెక్షన్ల గురించి ట్రేడ్ అనలిస్టు తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. బాక్సాఫీస్ వద్ద స్టడీగా ఈ సినిమా కలెక్షన్లను రాబడుతున్నది. వారాంతంలో బిజినెస్ బాగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రం తొలి రోజున రూ.6.40 కోట్లు, రెండో రోజున రూ.5.40 కోట్లు, మూడో రోజున రూ.4.22 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఈ చిత్రం రూ.16.02 కోట్ల నికర వసూళ్లను నమోదు చేసింది అని ట్వీట్ చేశారు.

పొట్టి బట్టల్లో రచ్చ.. ఆహానా కుమ్రా పిక్స్ వైరల్

ఇక ఓవర్సీస్‌లో ఈ చిత్రం భారీగా వసూళ్లను సాధిస్తున్నది. మూడు రోజుల్లో ఈ సినిమా రూ.200 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రం సుమారు రూ.1300 కోట్ల వ్యయంతో రూపొందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X