Godzilla x Kong Collections 1130 కోట్ల బడ్జెట్.. 3 రోజుల్లో 800 కోట్ల ఊచకోత.. ఇండియాలో ఎన్ని కోట్లంటే?

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు లెజెండరీ పిక్చర్స్, వార్నర్ బ్రదర్స్ పిక్చర్స్ నిర్మాణంలో ఆడమ్ వింగార్డ్ దర్శకత్వం వహించిన చిత్రం గాడ్జిల్లా x కాంగ్: ది న్యూ ఎంపైర్. రెబాకా హాల్, బ్రియన్ టైరీ హెన్రీ, కాయ్లీ హాటిల్, అలెక్స్ ఫెమ్స్, ఫాలా చెన్ నటించిన ఈ చిత్రం మార్చి 29వ తేదీన రిలీజైంది. ఈ చిత్రం బడ్జెట్ ఎంత? ప్రస్తుతం సాధిస్తున్న కలెక్షన్లు, బ్రేక్ ఈవెన్ రికార్డు వివరాల్లోకి వెళితే..

2021లో విడుదలైన గాడ్జిల్లా వర్సెస్ (Godzilla x Kong) కాంగ్ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందింది. ఫస్ట్ పార్ట్ విషయానికి వస్తే.. 155 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు.ఇక తాజాగా గాడ్డిల్లా వర్సెస్ కాంగ్: ది న్యూ ఎంపైర్ సినిమాను 140 మిలియన్ డాలర్లతో అంటే సుమారుగా 1130 కోట్ల రూపాయలతో నిర్మించారు.

Godzilla x Kong The New Empire 3 days Box Office Collections Worldwide

గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ చిత్రానికి ఇండియాలో మంచి స్పందన లభించింది. భారీ ప్రమోషన్స్‌ వర్కవుట్ కావడం, విద్యార్థుల పరీక్షలు పూర్తి కావడంతో ఈ చిత్రానికి పాజిటివ్‌గా మారింది. ఇక ఈ సినిమా ఇండియాలో మంచి ఆక్యుపెన్సీ కనిపించింది. హిందీ వెర్షన్‌కు 50 శాతం, ఇంగ్లీష్ వెర్సన్ 55 శాతం, తమిళంలో 50 శాతం, తెలుగులో 45 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది.

గాడ్జిల్లా వర్సెస్ (Godzilla x Kong) మూవీ తొలి రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. హిందీలో 3.5 కోట్ల రూపాయలు, తమిళంలో 2.5 కోట్ల రూపాయలు, తెలుగులో 1.5 కొట్ల రూపాయలు, ఇంగ్లీష్ వెర్షన్ 5.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్ర తొలి రోజు 13 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించింది. ఇక రెండో రోజు ఇంగ్లీష్‌లో 5.5 కోట్ల రూపాయలు, తెలుగులో 1.25 కోట్లు, తమిళంలో 2.25 కోట్లు, హిందీలో 3.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రెండో రోజు మొత్తంగా 12 కోట్ల రూపాయలుకుపైగా వసూలు చేసింది. దాంతో రెండు రోజుల్లో 25 కోట్ల రూపాయలను రాబట్టింది.

Godzilla x Kong The New Empire 3 days Box Office Collections Worldwide

ఇక మూడో రోజు హాలీడే కావడంతో భారీగా వసూళ్లు నమోదు అయ్యాయి. మూడో రోజు ఇంగ్లీష్‌లో 6 కోట్ల రూపాయలు, తెలుగులో 1.5 కోట్లు, తమిళంలో 2.5 కోట్లు, హిందీలో 4 కోట్ల రూపాయలు బాక్సాఫీస్ వద్ద కలెక్ట్ చేసింది. దాంతో ఈ మూవీ 14 కోట్లు రాబట్టింది. దాంతో ఈ చిత్రం ఇండియాలోనే 40 కోట్ల రూపాయల మేర వసూళ్లను సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. గత మూడు రోజుల్లో ఈ చిత్రం 800 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలివారాంతం వరు అమెరికాలో ఈ సినిమా 70 మిలియన్ డాలర్లు, మిగితా దేశాల్లో 170 మిలియన్ డాలర్లు అంటే.. 2000 కోట్లు వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వారం ముగింపు వరకు బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X