Good Bad Ugly Advance Booking Collections: అజిత్ రికార్డు అడ్వాన్స్ బుకింగ్‌.. వరల్డ్‌వైడ్ ఎన్ని కోట్లంటే?

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో విరుచుకుపడుతున్నారు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్. ఈ ఏడాది ఫిబ్రవరిలో విదాముయార్చితో అభిమానులను పలకరించారు తలా. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోవడంతో అజిత్ ఫ్యాన్స్ నిరాశ చెందారు. రోజులు తిరక్కుండానే గుడ్ బాడ్ అగ్లీ అంటూ థియేటర్‌లలోకి దిగబోతున్నారు అజిత్ కుమార్. ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడైపోయాయి. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్‌లో గుడ్ బాడ్ అగ్లీ ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే :

అజిత్‌కు తమిళనాట ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటుడిగా కంటే వ్యక్తిత్వంతోనే అజిత్‌ అందరి హృదయాలను గెలుచుకున్నారు. రిలీజ్ రోజున అజిత్ సినిమా ఫస్ట్ షో చూడాల్సిందే అన్నట్లుగా అభిమానులు పూనకం వచ్చినట్లుగా ఊగిపోతారు. మొన్నామధ్య అజిత్ సినిమా చూడటానికి డబ్బులివ్వలేదని ఏకంగా కన్నతండ్రినే చంపోయాడో యువకుడు. ఇక థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ బ్యానర్లు, రక్తదానం, అన్నదానాలతో పండుగ వాతావరణం చేస్తారు.

Good Bad Ugly Advance Booking Collections Worldwide ajith Kumar s Movie collected Rs 8 crore ahead of release

అజిత్ గత చిత్రం విదాముయార్చికి రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ జరగ్గా.. ఫ్యాన్స్ దెబ్బకి సర్వర్లు క్రాష్ అయిపోయాయి. ఈ దెబ్బకు బుకింగ్ నిలిపివేస్తున్నట్లు థియేటర్ యాజమాన్యాలు ప్రకటించాల్సి వచ్చింది. అలా ఉంటుంది మరి అజిత్ ఫ్యాన్స్‌తోనీ. అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డు కలెక్షన్స్‌తో బీభత్సం సృష్టించడం అజిత్ స్టైల్. తన రికార్డులను తానే బ్రేక్ చేస్తూ దూసుకెళ్తున్నాడు . తలా లేటెస్ట్ మూవీ గుడ్ బాడ్ అగ్లీ. ఇందులో త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు.

టాలీవుడ్ బడా నిర్మాణ సంస్ధ మైత్రీ మూవీ మేకర్స్ దాదాపు రూ.220 కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా ప్రభు, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, రాహుల్ దేవ్, యోగి బాబు, ప్రియా ప్రకాష్ వారియర్, టామ్ చాకో తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 10న గుడ్ బాడ్ అగ్లీ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకు రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. రొమియో పిక్చర్స్‌ తమిళనాడు థియేట్రికల్ రైట్స్‌ని, కేవీఎన్ ప్రొడక్షన్స్ కర్ణాటక థియేట్రికల్ రైట్స్‌ని, శ్రీగోకులం మూవీస్ కేరళ థియేట్రికల్ రైట్స్‌ని, ప్రత్యంగిరా సినిమాస్ యూఎస్ థియేట్రికల్ రైట్స్‌ని సొంతం చేసుకున్నాయి. అయితే అది ఎంత మొత్తానికి అన్నది మాత్రం తెలియరాలేదు.

మరో నాలుగు రోజుల్లో సినిమా రిలీజ్ కానుండటంతో తమిళనాడుతో పాటు కొన్ని ఎంపిక చేసిన థియేటర్‌లలో గుడ్ బాడ్ అగ్లీ అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. అజిత్ అభిమానుల దెబ్బకు క్షణాల్లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడై అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే భారీ వసూళ్లను రాబడుతోంది గుడ్ బాడ్ అగ్లీ. ఏప్రిల్ 6వ తేదీ ఉదయం 10 గంటల వరకు 3.15 లక్షల టికెట్స్ అమ్ముడవ్వగా.. ఇండియా వైడ్ రూ.6.30 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

ఇక అమెరికా + నార్త్ అమెరికాలో గుడ్ బాడ్ అగ్లీకి అడ్వాన్స్ బుకింగ్‌లో రూ.2 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా ఇప్పటి వరకు ప్రీ సేల్స్‌లోనే అజిత్ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ.8 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. రిలీజ్‌కు ఇంకా సమయం ఉండటంతో రాబోయే రోజుల్లో గుడ్ బాడ్ అగ్లీ ఇంకెన్నీ సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X