Good Bad Ugly Closing Collections : గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్టా? ఫట్టా? అజిత్ మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రవిశంకర్ యలమంచిలి, నవీన్ యెర్నెనీ సంయుక్తంగా గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాన్ని నిర్మించారు. అజిత్ కుమార్, త్రిష కృష్ణన్ జంటగా నటించిన ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా బడ్జెట్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఈ సినిమాకు లాభమా? నష్టమా? అనే వివరాల్లోకి వెళితే..

విదాముయార్చితో ఫ్లాప్ అందుకున్న అజిత్ కుమార్ ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యారు. ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆయన నటించిన చిత్రమే గుడ్ బ్యాడ్ అగ్లీ. టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కార్యక్రమాలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మెరుగైన ప్రదర్శన చేసింది.
గుడ్ బ్యాడ్ అగ్లీ బడ్జెట్ & బిజినెస్
ఈ చిత్రంలో ప్రభు, అర్జున్ దాస్, ప్రసన్న, సునీల్, రాహుల్ దేవ్, యోగి బాబు, ప్రియా ప్రకాష్ వారియర్, టామ్ చాకో తదితరులు కీలకపాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చగా.. అభినందన్ రామానుజం సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ప్రతిభావంతులైన నటీనటులు, సాంకేతిక నిపుణుల పారితోషికం, ప్రమోషనల్ కార్యక్రమాలతో కలిపి గుడ్ బ్యాడ్ అగ్లీకి దాదాపు రూ.270 కోట్లకు పైగా బడ్జెట్ అయినట్లు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. అజిత్ ఫాలోయింగ్ , టీజర్, ట్రైలర్లు , ప్రమోషనల్ కార్యక్రమాలతో గుడ్ బ్యాడ్ అగ్లీకి భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో రూ.5 కోట్లు , తమిళ, కన్నడ, మలయాళం , రెస్టాఫ్ ఇండియా + ఓవర్సీస్ కలిపి ప్రపంచవ్యాప్తంగా గుడ్ బ్యాడ్ అగ్లీకి రూ.114 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ విషయానికి వస్తే గుడ్ బ్యాడ్ అగ్లీ డిజిటల్ రైట్స్‌ను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ దాదాపు రూ.94 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.
గుడ్ బ్యాడ్ అగ్లీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?
బిజినెస్ దృష్ట్యా అజిత్ సినిమా లాభాల్లోకి రావాలంటే.. రూ.115 కోట్ల షేర్, రూ.230 కోట్ల గ్రాస్ రాబట్టాలని విలువ కట్టారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా సేఫ్ జోన్‌లోకి రావాలంటే రూ.6 కోట్ల షేర్.. రూ. 12 కోట్ల నెట్ రావాలని నిర్దేశించారు. ఒక్క తమిళనాడులోనే తొలి రోజు ఏకంగా 2400 స్క్రీన్‌లలో ఈ సినిమాను విడుదల చేశారు.
గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్స్ :
ఇక గుడ్ బ్యాడ్ అగ్లీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. తొలి రోజు రూ.40 కోట్లకు పైగా ఓపెనింగ్స్‌తో దుమ్మురేపాడు అజిత్ . ఈ సినిమా 23 రోజుల వరకు ఇండియాలో రూ.153.18 కోట్ల నెట్.. రూ.179.1 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటకలో రూ.14.3 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ.6.38 కోట్లు, తమిళనాడులో రూ.151.16 కోట్లు, కేరళలో రూ.5.13 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ.2.03 కోట్లు చొప్పున మొత్తంగా ఇండియా వైడ్ రూ.179 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకుంది. ఇండియాలో వచ్చిన గ్రాస్ + ఓవర్సీస్‌లో వచ్చిన రూ.66 కోట్ల కలెక్షన్స్ కలిపి ఇప్పటి వరకు అజిత్ చిత్రం రూ.245.1 కోట్లు రాబట్టింది.
గుడ్ బ్యాడ్ అగ్లీకి ఎన్ని కోట్ల లాభమంటే?
గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా థియేట్రికల్ బిజినెస్ వాల్యూ ప్రకారం చూస్తే.. ఈ సినిమా పూర్తి రికవరీ సాధించి లాభాల్లోకి వచ్చింది. దాదాపు రూ.15 కోట్లకు పైగా లాభాలతో అజిత్ మూవీ థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ చేసింది. ఓవరాల్ బడ్జెట్, థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్, ఆడియో రైట్స్ అన్ని ఈ సినిమాకు భారీ లాభాలను అందించినట్లు ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











